ఈ రాశులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్న 5 గ్రహాలు

మనిషి ఉన్నతి సాధించాలంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ సరిపోవు. గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. జాతక చక్రం బాగుంటే ఆ వ్యక్తికి తిరుగుండదు. అందులోను జాతకంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఏవిధంగా కలిసివస్తుందో అర్థం చేసుకోండి. మొత్తం నవగ్రహాల్లో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండటంవల్ల వారు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. కుజుడు, సూర్యుడు, గురుడు, శని, బుధుడు అనుకూలంగా ఉన్న రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. అన్నీ శుభపరిణామాలే చోటుచేసుకుంటాయి. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. బాగా డబ్బున్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తులు కలిసివచ్చి ఆదాయం పెరుగుతుంది.

As 5 planets are favorable the four zodiac signs will get along financially

వృషభ రాశి
ఈ రాశివారికి ఈ సమయం అత్యంత అనుకూలం. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. చిన్న ప్రయత్నంతోనే సొంతింటి కల నెరవేరుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. కుటుంబ సభ్యులంతా శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

కర్కాటక రాశి
వీరికి విదేశాల నుంచి వచ్చే సొమ్ము వల్ల లబ్ధి కలుగుతుంది. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తులు కలిసివస్తాయి. నవంబరు 15వ తేదీ వరకు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నవారికి కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారం.. రెండింటిలో లాభాలు కలుగుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.

మేష రాశి
ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండటంవల్ల నవంబరు 15వ తేదీ వరకు వీరికి తిరుగులేదు. వృత్తితోపాటు వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారి కోరికలన్నీ నెరవేరతాయి. నష్టాల్లో ఉన్నవారంతా లాభాల బాటలోకి పయనిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల నుంచి ఉద్యోగులకు, నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. ఎక్కువ శుభవార్తలు వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+