అంగారకుడివల్ల జులై 1 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు
ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంటుంది. అంగారకుడు కూడా తన రాశిని మార్చనున్నాడు. వచ్చే నెల ఒకటో తేదీన కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మార్పు ప్రభావం మొత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ధైర్యానికి కారకుడైన కుజుడు రాశి మారుస్తుండటంవల్ల ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
తులారాశి: తులారాశివారికి కలిసివస్తుంది. ఈ రాశికి సంబంధించిన ఆదాయంలో కుజుడు సంచరించబోతున్నాడు. దీనివల్ల ఆదాయం విపరీతంగా వృద్ధి చెందుతుంది. కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సామాజికంగా పాపులారిటీ పెరగడంతోపాటు గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

గతంలో పెట్టి నిలిపేసిన పెట్టుబడులు ఇప్పుడు వృద్ధి చెందుతాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. షేర్ మార్కెట్ తోపాటు బెట్టింగ్, లాటరీ అలవాటున్నవారికి బాగా డబ్బులు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది.
మేషరాశి: అంగారకుడి సంచారం మేషరాశివారికి మంచి ప్రయోజనాలనిస్తుంది. జాతకంలో ఐదో ఇంట్లో అంగారకుడు సంచరించబోతుండటంవల్ల ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కుజుడు ఆరోహణ, 8వ ఇంటికి అధిపతి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి.
వృశ్చిక రాశి: కుజుడి రాశి మార్పు వీరికి లాభాన్ని చేకూరుస్తుంది. 9వ ఇంట్లో సంచరింబోతున్నాడు. దీనివల్ల అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది. చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతును పొందుతారు. ఈ సమయంలోనే మీ కోరికలన్నీ నెరవేరతాయి. జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications