మార్చి 5 నుంచి ఆ రాశులవారికి కష్టాలు ప్రారంభం?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జనవరి 30, 2023 నుంచి అస్తమించి ఉన్న శనిగ్రహం మార్చ్ 5న కుంభరాశిలో ఉదయించబోతోంది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. శని గ్రహం మార్చ్ 5వ తేదీన కుంభరాశిలో ఉదయిస్తోంది. ముఖ్యంగా నాలుగు రాశులకు తీవ్రంగా ఉండనుంది. అంటే ఈ నాలుగు రాశుల వారికి మార్చి 5వ తేదీ నుంచి కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఏయే రాశులకు క్లిష్ట సమయమో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జనవరి 30, 2023 నుంచి అస్తమించి ఉన్న శనిగ్రహం మార్చ్ 5న కుంభరాశిలో ఉదయించబోతోంది. శని తిరిగి ఉదయించడం కొన్ని రాశులకు కష్టంగా మారడంతోపాటు తీవ్రమైన నష్టాలు ఎదురవుతాయి. అదే సమయంలో బుధుడు ఫిబ్రవరి 28వ తేదీన కుంభరాశిలోనే అస్తమించనున్నాడు. అంటే శని రాశిలో శని ఉదయించడం, బుధుడు అస్తమించడం వల్ల మొత్తం అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా కన్య, వృశ్చిక, మకర, మీన రాశులపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కన్యా రాశి

కన్యా రాశి


శని గ్రహం కుంభరాశిలో ఉదయించడం వల్ల కన్యారాశి జీవితంలో ఎగుడు దిగుళ్లు ఉంటాయి. సహచరుల కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఖర్చులు పెరగడం వల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తడంతోపాటు కోపాన్ని నిగ్రహించుకోకపోతే అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యక్తిగత జీవితం, పని వ్యవహారం.. ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయకపోతే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

శని గ్రహం ఉదయించడం వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కాస్త అనుకూలంగా, కాస్త ప్రతికూలంగా ఉండవచ్చు. కావల్సినవారితో వివాదం ఏర్పడే అవకాశం ఉంది. అదృష్టం తోడివ్వనందున జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. కానీ ఉత్పన్నమవుతాయి. సోదరులతో , బంధువులతో వివాదం రావచ్చు. జీవిత భాగస్వామితో ఘర్షణ మంచిది కాదు.. లేదంటే ఇద్దరి మద్య సంబంధాలు చెడిపోవచ్చు.

మకర రాశి

మకర రాశి

కుంభరాశిలో శనిగ్రహం ఉదయించడం వల్ల మకర రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. వృత్తిపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పనిలో, ఇతర వ్యవహారాల్లో ఒత్తిడి పెరగడంతో తల్లి ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఆస్థి సంబంధిత వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

మీనరాశి

మీనరాశి

శని గ్రహం ఉదయించడం మీనరాశి వారికి మంచిది కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతోపాటు ఈ జాతకం వారికి ప్రేమ, వైవాహిక జీవితంలో పొరపొచ్ఛాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇద్దరూ పరస్పరం మాట్లాడుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి సమస్యలు పెరుగడంతోపాటు అనవసరపు ఖర్చులుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+