ఈనెల 9వ తేదీ నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలను, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను ప్రసాదిస్తుంటాయి. నవగ్రహాల్లో కీలక గ్రహమైన బృహస్పతి దేవతలకు గురువు. ఆయన జ్ఞానానికి, వివాహానికి, సంతాన యోగానికి, ఆధ్యాత్మికతకు, శ్రేయస్సు, విద్య, కర్మ, మతం, సంపద తదితరాలకు కారకుడు. ఆయన దయ ఉంటే ధనలక్ష్మి ఇంట్లో విలయతాండవం చేస్తుంది. ఈనెల 9వ తేదీన మిథునరాశిలో ఉదయించబోతున్న బృహస్పతి వల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి
పెళ్లి కానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనుకోకుండా లాభాలను అందుకుంటారు. ఇప్పుడు ఉన్న స్థితికంటే ఇంకా మెరుగైన స్థితికి చేరుకోవాలనుకునేవారు దుర్గాదేవిని పూజించాలి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. పనికోసం చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కూడా లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామి దొరుకుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు.

from the 9th of this month these zodiac signs will transform even the simplest things into treasures

సింహ రాశి
వ్యాపార భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు మరో వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. చేస్తున్న పనిలో బాధ్యత పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగస్థులకు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో మంచి పేరు వస్తుంది. పనితీరుపై పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వేతనం పెరుగుతుంది. పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు. నలుగురికి సాయం చేసే గుణం ఉంది. దాన్ని ఇంకా పెంపొందించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

వృషభ రాశి
గతంలో కంటే ఆదాయం ఇప్పుడు బాగా పెరుగుతుంది. గతంలో ఇచ్చిన బాకీలు, ఇక రావు అనుకున్న డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి. బృహస్పతి అనుగ్రహంతో గురువారం పేదలకు వస్త్రదానం చేస్తే మంచిది. దీనివల్ల గురువు అనుగ్రహం మీపై ఉంటుంది. ఫలితంగా ఆదాయం గతంలోకంటే పెరుగుతుంది. సంపద పరంగా, డబ్బు పరంగా మంచి స్థాయిలో ఉంటారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+