బుధుడి గోచారంతో నేటి నుంచి ఆ 5 రాశులవారి దశ తిరగనుంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక నిర్దిష్ట సమయంలో ప్రతి గ్రహం రాశిని మారుస్తుంటుంది.
మార్చి నెలలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ఎక్కువగా ఉంటుంది. వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందడమే గ్రహ గోచారంగా పిలుస్తారు. దీని ప్రభావంతో ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక నిర్దిష్ట సమయంలో ప్రతి గ్రహం రాశిని మారుస్తుంటుంది. ఒక గ్రహం మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా అది రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంటుంది. దీనిలో భాగంగానే నేటినుంచి బుధుడు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం ఏఏ రాశులపై మంచి ఫలితం ఉంటుందంటే.

గ్రహాల రాజకుమారుడు బుధుడు
బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుస్తుంటుంది. నేడు బుధుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఈరోజు ఉదయం 10.54 గంటలకు బుధుడి గోచారముంది. ఈ సందర్భంగా సూర్య, బుధ గ్రహాల యుతి ఏర్పడబోతోంది. బుధుడు మీనరాశి గోచారం 5 రాశులకు ఊహించని ధనలాభాన్ని కలుగజేయబోతోంది. ఆ ఐదు రాశుల వరకు ఊహించని రీతిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆదాయం విషయంలో అనుకూలతలు పెరగడమే కాకుండా వ్యాపార రంగంలో పెట్టుబడులు విస్తరిస్తారు. దీనివల్ల అధిక లాభాలు ఆర్జించడమే కాకుండా కుటుంబ విషయాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మరి ఆ ఐదు రాశుల్లో మీరూ ఉన్నారా.?

వృషభ రాశి:
మీన రాశిలో బుధుడి గోచార ప్రభావంతో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సందర్భంగా ధనయోగం కలుగుతుంది. ప్రత్యేకించి స్నేహితుడి నుంచి బంధువుల నుంచి సహాయం పొందుతారు. పెట్టుబడులకు అనువైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగడమే కాక ఈ సమయంలో ఏదైనా అవార్డు లేదా సత్కారం లభించనుంది.

కర్కాటక రాశి:
ఈ రాశి వారిపై బుధుడి గోచారం అత్యంత అనుకూలం ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వీరికి విదేశీ ప్రయాణ యోగం ఉంది. విదేశాల్లో చదవాలనే కోరిక దీంతొ నెరవేరనుంది. వ్యాపారస్తులకు లాభాలే కాకుండా వారు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.

వృశ్చిక రాశి:
ఈ రాశి వారిలో వ్యాపార వర్గాలకు మంచి ఫలితాలున్నాయి. వ్యాపారం పెంచేందుకు కీలకమైన పెట్టుబడి లభించడంతోపాటు భాగస్వామి ప్రతిపాదన కూడా ఉంటుంది. ఈ గోచారం వృశ్చిక రాశివారికి చాలా అనుకూలమైన సమయం. షేర్ మార్కెట్ లో పెట్టుబడులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి:
జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం ఈ రాశి వారికి బుధుడి గోచారంతో విద్యారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. ఉద్యోగాలు ఇతర విధులు నిర్వర్తించే వారికి పదవి, గౌరవ మర్యాదలు పెరగడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పనులకు సంబంధించిన పనుల్లో విజయం లభించబోతోంది. ఈ సమయంలో మీ ప్రతిష్ట మరింత పెరగడమే కాక ఆర్ధిక ఇబ్బందులుంటే అవి దూరమవుతాయి.

మీన రాశి:
జ్యోతిష్య శాస్త్ర రీత్యా బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తున్న కారణంగా ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమయం మీన రాశి జాతకులకు సుఖసంతోషాలనివ్వడమే కాదు.. వ్యాపారంలో వీరు తీసుకోబోయే నిర్ణయాలు ఎదుటివారికి విచిత్రమనిపిస్తాయి. మాట ప్రభావం కూడా ఇతరులపై ఉండటమేకాదు.. ఆర్థికంగా సైతం కలిసి రాబోతోంది.












Click it and Unblock the Notifications