ఏడవ రోజు దుర్గాదేవికి అవతారం 'కదంబం' ప్రసాదం
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
శరన్నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి అవతారాన్ని కొలుస్తారు. అమ్మవారికి 'కదంబం' ప్రసాదం నివేధన చేస్తారు.
కదంబం తయారు చేయడానికి కావలసినవి పదార్ధాలు :-

కందిపప్పు 1/2 కప్పు
బియ్యం 1/2 కప్పు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1 వంకాయ
1/4 సొరకాయ
1 దోసకాయ
బీన్స్ తగినన్ని
1 ఆలు
పల్లీలు 2 పిడికిళ్ళు
2 మొక్కజొన్నలు
1/2 క్యారెట్
2 టోమాటో
తగినంత కర్వేపాకు
కొత్తిమీర
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప
4 పచ్చిమిర్చి
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గుజ్జు తగినంత
కాస్త బెల్లం
ఉప్పు , పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ .
చేయవలసిన విధానము :- ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని ఉంచుకోండి కుక్కర్లో కందిపప్పు, బియ్యం, పల్లీలు, టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి పసుపు, ఉప్పు, నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆపేయండి.
మూకుడులో కొద్దిగ నూనె వేడి చేసాక అందులో కొద్దిగా ఆవాలు వేసి అవి చిట్లిన తర్వాత పచ్చిమిర్చి, కర్వేపాకు, టొమాటో, చింతపండు గుజ్జు , సాంబర్ పౌడర్ , బెల్లం వేసి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవి అంతా ఉడికిన బియ్యంలో వేసి కొత్తిమీర, కర్వేపాకు, నెయ్యివేసి మరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందండి.
-
ఈనెల 18 నుంచి చతుర్గ్రాహి యోగంతో ఈ రాశుల పంట పండింది -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి -
మఖ నక్షత్రంలోకి కేతువు.. మార్చి 29 నుండి ఈ రాశులవారికి అన్నీ శుభాలే! -
సింహరాశి ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది వీరికి గడ్డుకాలం.. అయినా సరే.. -
today rashiphalalu: మీనరాశిలో త్రిగ్రహాలు వీరికి తిరుగులేని సంపదలు ఇస్తున్నాయి! -
ఏప్రిల్ లో కుజ బుధుల సంయోగంతో వ్యూహాత్మక శక్తి యోగం.. వీరికి కుబేర కటాక్షం! -
today rashiphalalu: మీనరాశిలో శని అస్తమయం, కుంభరాశిలో బుధోదయంతో వీరికి సంపదల సంక్రాంతి -
కన్యారాశి వారికి ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే.. కలిసొచ్చే లక్కీ ఇయర్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications