ఈనెల 11 తర్వాత ఈ రాశులపై లక్ష్మీదేవి అదృష్ట వర్షం
ఈనెల 11 తర్వాత శని ప్రభావం తగ్గనుంది. అదేరోజు శనిదేవుడు కుంభరాశిలో అస్తమిస్తాడు. ఈ రాశిలో నెలరోజులు ఉంటాడు. ఇలా శని అస్తమించడంవల్ల కొన్ని రాశిచక్ర గుర్తులవారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం ఒక రాశిలో గ్రహం ఉదయించడం లేదంటే అస్తమించడం జరిగినప్పుడు కచ్చితంగా వాటి ప్రభావం ఉంటుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు కుంభంలో అస్తమించనున్నాడు. దీనివల్ల కలిసిరానున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.
మిథునరాశి
ఈ రాశివారికి శని అస్తమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఆశించిన విజయం పొందుతారు. అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మార్చి 18వ తేదీ వరకు ప్రతి పనిలో విజయం సాధించడమేకాదు.. సంపదను కూడా పెంచుకుంటారు. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు.

కర్కాటకరాశి
శని అస్తమయం తర్వాత వీరికి అదృష్టం పడుతుంది. వ్యాపారంలో లాభపడతారు. వ్యక్తిగత జీవితంలో భాగస్వామి నుంచి పూర్తిమద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. చేపట్టే ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం చేయడంవల్ల ప్రయోజనాలను పొందుతారు. ఇంట్లో పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.
సింహరాశి
శని అస్తమించడంవల్ల సింహరాశివారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ లో పై అధికారుల నుంచి మద్దతు లభించడంవల్ల పురోగతి సాధిస్తారు. అలాగే కొత్త ఉద్యోగం మారానులకుంటున్నవారికి ఇది మంచి సమయం. పనికి సంబంధించి దూర ప్రయాణాలు చేస్తారుకానీ అది కూడా ఆర్థికంగా లాభాన్ని కలగజేస్తుంది. భూమి లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు.












Click it and Unblock the Notifications