ఫిబ్రవరిలో ఈ రాశులవారి ఇళ్లల్లో లక్ష్మీదేవి విలయ తాండవం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెల కీలకమైంది. ఈ నెలలో ప్రధాన గ్రహాల రాశి సంచారంతోపాటు పలు పండగలున్నాయి. రెండోతేదీన ఘనంగా సరస్వతి మాత జన్మదినం వసంత పంచమిని జరుపుకున్నాం. ఆరోజు నుంచి శుక్రుడు, గురుడు, బుధుడు ఉచ్ఛ స్థితికి చేరతారు. అలాగే కుంభరాశిలో బుధుడు, శని సంయోగం జరుగుతుంది. గురుడు, శుక్రుడి మధ్య రాశి పరివర్తనం జరుగుతుంది. ఇటువంటి పరిణామాల మధ్య ఆరు రాశులవారికి బాగా కలిసి రావడమే కాకుండా అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. వారికి ఏవిధంగా కలిసిరానుంది? ఏయే ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.

తుల
ఈ రాశివారి ఇంట్లో లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. పెళ్లి కుదురుతుంది. ఆర్థిక సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగడానికి ఎంతగా కృషిచేస్తే అంతగా కలిసివస్తుంది.

Goddess Lakshmi showering wealth in the homes of these zodiac signs due to key planets transit in february month

మకరం
ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు వస్తాయి. బాగా సంపన్న కుటుంబంతో వివాహం కుదురుతుంది. పలు శుభవార్తలు చెవిన పడతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు మాత్రం భారీ లాభాలున్నాయి.

కుంభం
షేర్ మార్కెట్ సంబంధితవాటిల్లో విపరీతమైన ధనలాభం ఉంది. ఆస్తి వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. పెళ్లి కూడా మీరు బాగా ఇష్టపడే వ్యక్తితో కుదురుతుంది. మీరు ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందుతారు. అలాగే ఆస్తి కలిసివస్తుంది. ఉద్యోగస్తులు వారి కార్యాలయాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు.

మేషం
షేర్లు, స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల నుంచి ధనలాభం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా జరుగుతాయి. ప్రేమలో ఉన్నవారిని ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు. ఆదాయం పెరిగి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు వారు ఊహించనిరీతిలో అవకాశాలు తలుపు తడతాయి.

వృషభం
ఉద్యోగస్తులకు ఉన్నతస్థాయి పదవులు వస్తాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఈ నెల మొత్తం జీవితం సాఫీగా సాగుతుంది. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు.

మిథునం
ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో మంచి ప్రాధాన్యం లభిస్తుంది. బాగా సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. డబ్బుకు లోటు లేకుండా జీవితం సాగుతుంది. కోరికలన్నీ నెరవేరతాయి. మీరు కోరుకున్న గుర్తింపు కచ్చితంగా లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+