ఈ చిన్న పనులు చేయండి.. లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది!
ప్రతి ఒక్కరూ ఇంటిని ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇల్లు మనకు ప్రశాంతత, భద్రత అందిస్తూ బయట ప్రపంచ ఒత్తిళ్ల నుంచి కాపాడుతుంది. వాస్తు శాస్త్రంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కొన్ని పనులతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, అదృష్టాన్ని ఆకర్షించవచ్చని వాస్తు చెబుతోంది. అయితే వీటిని ఇంట్లోనే నిలిపి ఉంచి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరికొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అదృష్టాన్ని, సానుకూలతను నిలుపుకోవడానికి పాటించాల్సిన వాస్తు టిప్స్ ఏవో చూద్దాం.
ప్రతి ఒక్కరికీ ఇల్లు అనేది పవిత్రమైన ప్రదేశం. మనకు ఎంతో ప్రశాంతతను అందించడంతోపాటు బయట నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి కాపాడుతుంటుంది. కొన్ని పనులు చేయడంద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, అదృష్టాన్ని తీసుకురావచ్చని వాస్తు చెబుతోంది. ఆ విషయాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో విండ్ చైమ్స్, నెమలి ఈకలు, వెదురు మొక్క లాంటి వస్తువులను ఉంచాలి. ప్రతికూలతలను తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటికి ఆగ్నేయ మూలలో వెదురు మొక్కను నాటాలి.

ఉప్పుతో ఇంటిని తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటినుంచి బయటకు పంపిస్తుంది. ప్రతి గది మూల చిటికెడు ఉప్పు చల్లి ఒకరోజు గడిచిన తర్వాత తుడిచేయాలి. అలాగే నిత్యం ఉదయంపూట ప్రార్థన లేదంటే ధ్యానం చేయాలి. మనసుకు ప్రశాంతతోపాటు ప్రతికూల శక్తిని ఇవి తొలగిస్తాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచడానికి దీపం వెలిగించాలి. ప్రవేశ ద్వారం వద్ద అద్దాన్ని ఎదురుగా ఉంచొద్దు. ఇది శక్తిని తిరిగి బౌన్స్ చేస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తి రాకుండా నిరోధించే అవకాశం ఉంది. ఫిష్ ట్యాంక్ లేదంటే వాటర్ ఫౌంటెన్ పెడితే సంపదను, ఆనందాన్ని ఆకర్షిస్తాయి. వీటిలో నీరు సాఫీగా ప్రవహించేలా, శుభ్రంగా ఉంచేలా చూడటం ముఖ్యం. చిందర వందరగా ఉండే ఇల్లు సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. అవసరం లేని వస్తువులను పేదలకు ఇవ్వడంతోపాటు ఇంటిని తరుచుగా శుభ్రంగా ఉంచుకుంటుండాలి.












Click it and Unblock the Notifications