మీ ఇంట్లో ఇవి ఉంటే.. అదృష్టం తలుపు తడుతుంది..!
ఏ పని తలపెట్టినా దానిపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళితే ఆ నమ్మకమే జీవితాన్ని నడిపిస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం తలుపు తడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం వరించి వాటివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని, వాటిద్వారా అదృష్టం వస్తుందని వెల్లడిస్తున్నారు. అవి ఏయే వస్తువులనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరికాయ: కొబ్బరికాయ, కొబ్బరి బొండాం లేకుండా ఏ పూజా పూర్తికాదు. ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా కొబ్బరికాయ కొట్టమని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవికి ప్రతీక అయిన కొబ్బరికి కచ్చితంగా పూజలో స్థానం లభిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే వస్తువుల్లో కొబ్బరి కూడా ఒకటి. ఎండుకొచ్చరి చిప్పను పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బులుంచేచోట పెట్టుకోవచ్చు.

తులసిమొక్క: ఇది పవిత్రమైందే కాకుండా ఔషధాల గనిగా పేరుపొందింది. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపమని శాస్త్రం చెబుతోంది. తులసిని ఇంటికి ఎదురుగా పెట్టుకోవడంవల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. తులసి ఉన్న ఇల్లు సిరి సంపదలు, ఆరోగ్యం, సుఖశాంతులతో తులతూగుతుంది.
తాబేలు: బొమ్మ తాబేలు సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు చెబుతోంది. లోహపు తాబేలు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి నడిచొస్తుందంటారు. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటిలో ఉంచుకోవచ్చు.తాబేలు ప్రతిమ సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ముత్యపు చిప్ప: సాక్షాత్తూ ఇది లక్ష్మీ స్వరూపం. ఆ తల్లి మెడలో ముత్యాలహారం ఉంటుంది. సముద్ర గర్భం నుంచే ఇవి పుట్టాయి కాబట్టి ముత్యపు చిప్పలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇది ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు.
నెమలి ఈకలు: నెమలి ఈకలు అనగానే వెంటనే మనకు శ్రీకృష్ణుడు గుర్తుకువస్తాడు. ఆయన్ను శిఖపించ మౌళి అంటారు. నెమలి ఈకలంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి పింఛం ఉన్నచోట లక్ష్మీ అమ్మవారు ఉంటారు.












Click it and Unblock the Notifications