శని దేవుని అనుగ్రహం .. కోటీశ్వరులయ్యే యోగం ఈ రాశులదే
భారతీయ జ్యోతిషశాస్త్రంలో శనిని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. దీనిని కర్మ కారకుడిగా , న్యాయానికి అధిపతిగా భావిస్తారు. శని వ్యక్తి యొక్క కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు అని నమ్ముతారు.శని అనుగ్రహం ఉంటే, వ్యక్తికి కష్టపడే తత్వం, నిబద్ధత, మరియు ఓర్పు వంటి లక్షణాలు లభిస్తాయి.
వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మరియు సమాజంలో గౌరవం పొందుతారు.శని దోషం ఉంటే, వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మరియు ఉద్యోగంలో ఒత్తిడి వంటివి కలుగుతాయి.ఈ నెలలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో శని దేవుని అనుగ్రహం ప్రధానంగా కొన్ని రాశుల వారి మీద ప్రభావం చూపించనుంది. ఆ రాశులను ఓ సారి పరిశీలిస్తే...

కర్కాటక రాశి
శని భగవానుడి ఆశీర్వాదాలు కర్కాటక రాశి వారిపై పుష్కలంగా ఉండనున్నాయి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికంగా డబ్బులు వచ్చి పడతాయి. కుటుంబంతో కూడా సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కలిసి వస్తోంది.
మేషరాశి
శని దేవుని ఆశీర్వాదం మేషరాశిపై కూడా ఉంటుంది. వీరి వ్యాపారంలో లాభం బాగా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు.
ధనస్సు రాశి
శని భగవానుడి అనుగ్రహం ధనస్సు రాశివారిపై కూడా ఉండనుంది.ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.ఉద్యోగులు పదోన్నతి పొందుతారు.












Click it and Unblock the Notifications