వాస్తు ప్రకారం.. ఇంట్లో ఇటువంటి మొక్కలను పెంచుతున్నారా?

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌స్టైల్‌లో ఇళ్లను పచ్చదనంతో నింపడానికి చాలామంది కృత్రిమ మొక్కలను ఎంచుకుంటోన్నారు. వీటికి నీరు పోయాల్సిన అవసరం లేదు, ఎండలో పెట్టాల్సిన పని లేదు. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఇవి ఎంతగా మెరిసిపోతూ కనిపించినా గానీ వాస్తు ప్రకారం వీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్ని ప్రతికూల ప్రభావాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ఇంట్లో కృత్రిమ మొక్కలను ఉంచడం పూర్తిగా నిషేధమేమీ కాదు. వాటిని ఉంచే స్థానం, శుభ్రతపైనే ఇంట్లోని సానుకూల శక్తి ఆధారపడి ఉంటుంది. పాడైపోయిన, విరిగిపోయిన ప్లాస్టిక్ మొక్కలు ఇంట్లో ఉండటం వాస్తు ప్రకారం ఎంతమాత్రం సరికాదు. అలాగే.. దుమ్ము పేరుకుపోయిన ప్లాస్టిక్ మొక్కలు ఇంట్లో ఉంటే అది నెగటివ్ ఎనర్జీకి దారితీస్తుంది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Grow Real Plants for Stronger Vastu Benefits rather than Plastic Pick the Right Varieties Best Placements

పవిత్రమైన పూజా గది పరిసరాలలో కృత్రిమ మొక్కలను అస్సలు పెట్టకూడదు. దేవుని గదిలో ఎప్పుడూ సహజ సిద్ధమైన తాజా పూలు లేదా నిజమైన మొక్కలను ఉంచడమే శ్రేయస్కరం. ప్లాస్టిక్ పూలు పూజా మందిరం పవిత్రతను దెబ్బతీస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తోన్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్లాస్టిక్ మొక్కలను అమర్చినప్పుడు మరింత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే.. ముఖద్వారం గుండానే ఇంట్లోకి లక్ష్మీదేవి, సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి.

వాస్తు ప్రకారం.. మంచం కింద ఎంత మాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం.. మంచం కింద ఎంత మాత్రం ఉంచకూడని వస్తువులు

అక్కడ దుమ్ముతో నిండిన లేదా విరిగిన కృత్రిమ మొక్కలు ఉంటే, అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అలాగే దారికి అడ్డంగా పెద్ద మొక్కలను పెట్టకూడదు. పడకగది ప్రశాంతతకు నిలయం. ఇక్కడ అతిగా ఆర్టిఫిషియల్ ప్లాంట్లను పేరుకుపోనివ్వకూడదు. ముదురు రంగులు, భారీ డిజైన్లు ఉన్న కృత్రిమ మొక్కలు మనశ్శాంతిని హరిస్తాయి. ఒకవేళ బెడ్‌రూమ్‌లో పెట్టాలనుకుంటే చాలా చిన్నగా, ప్రశాంతతను ఇచ్చే లేత రంగు డిజైన్లను ఎంపిక చేసుకోవడం మంచిది.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మెట్ల సంఖ్య ఎంత ఉండాలి.. మలుపులు ఏ దిక్కున రావాలి?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మెట్ల సంఖ్య ఎంత ఉండాలి.. మలుపులు ఏ దిక్కున రావాలి?

ఆర్టిఫిషియల్ ప్లాంట్లు కొనేటప్పుడు వాటి అందాన్ని మాత్రమే చూడకూడదు. పదునైన ఆకులు లేదా ముళ్ళు ఉన్నట్లు కనిపించే కృత్రిమ డిజైన్లను అస్సలు ఎంచుకోవద్దు. ఇవి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలకు కారణమవుతాయి. వాటిని కొనేటప్పుడు గుండ్రటి, మెత్తటి ఆకులు కలిగిన సహజ రూపంలో ఉండే మొక్కలనే ఎంచుకోవాలి. వాటిని సరైన దిశ, స్థానంలో మాత్రమే ఉంచాలి. అలంకరణ కోసం ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?

ప్లాస్టిక్ మొక్కలపై దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. ప్రాణం ఉన్న మొక్కలైతే వర్షానికో లేదా నీళ్లు చల్లినప్పుడో వాటంతట అవే శుభ్రపడతాయి. ఆర్టిఫిషియల్ మొక్కలను క్రమం తప్పకుండా మెత్తటి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. రంగులు వెలిసిపోయినా లేదా ఆకులు ఊడిపోయినా వెంటనే వాటిని తొలగించి కొత్త వాటిని మార్చడం మంచిది. వాటిని అలాగే ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.

వాస్తు ప్రకారం ఇంట్లో తులసి, మనీ ప్లాంట్ వంటి సహజసిద్ధమైన మొక్కలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అవి ఇంట్లోకి సహజమైన ప్రాణవాయువు, సానుకూల ప్రకంపనలను తెస్తాయి. స్థలం, సమయం లేనివారు కృత్రిమ మొక్కలను వాడుతున్నట్లయితే.. వాస్తు సూత్రాల ప్రకారం వాటిని శుభ్రంగా, క్రమపద్ధతిలో ఉంచుకోవడం ద్వారా ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+