గురుగ్రహ ఫలాలు వివిధ స్థానాలలో ఉన్నప్పుడు కలిగే ఫలాలు

ద్వాదశ స్థానం లో గురుని ఫలితం: ఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు.

హైదరాబాద్: ద్వాదశ స్థానం లో గురుని ఫలితం: ఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు. దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తినష్టటము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు.

లాభ స్థానం లో గురుని ఫలితం: మిక్కిలి అనుకూల స్థానం లో గురుని ఫలితం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును.

దశమ స్థానం లో గురుని ఫలితం: దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయి, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలుచేస్తారు.

నవమ స్థానంలో గురుని ఫలితం: మిక్కిలి అనుకూల స్థానం లో గురుని ఫలితం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.

అష్టమ స్థానం లో గురుని ఫలితం: వ్యతిరేక ఫలస్థానం లో గురుని ఫలితం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి .

సప్తమ స్థానం లో గురుని ఫలితం: : శుభఫలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును.


షష్ఠ స్థానం లో గురుని ఫలితం: : షష్ఠ స్థాన స్థానం లో గురుని ఫలితం: దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు.

పంచమ స్థానం లో గురుని ఫలితం: మిక్కిలి అనుకూల స్థానం లో గురుని ఫలితం. ఐశ్వర్యము పొందుతారు, ధనలాభముకలుగుతుంది, కొత్తస్నేహితులను కలుసుకొంటారు, వ్యవహారం లేదా చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనులస్నేహము పొందుతారు, సంతానము కలలుగుటకు అవకాశం వుంది, రాజానుగ్రహము పెద్దలఅనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును.

guru graha phal in various places

చతుర్థ స్థానం లో గురుని ఫలితం: కష్ట నష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళనకలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చుపరిస్థానం లో గురుని ఫలితం: ఏర్పడుతుంది, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము. మాటవిలువ తగ్గుట జరుగును.

తృతీయ స్థానం లో గురుని ఫలితం: తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థానం లో గురుని ఫలితం: నాశము.

ద్వితీయ స్థానం లో గురుని ఫలితం: శుభఫలస్థానం లో గురుని ఫలితం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది.

చంద్ర స్థితరాశి: వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+