Guru Purnima 2023: గురుబలం పెరగాలంటే పసుపుతో ఈ పనులు అస్సలు మర్చిపోకండి!!

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతన ధర్మంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి గురువును స్మరిస్తూ జరుపుకునే అతి పవిత్రమైన పండుగ గురుపౌర్ణమి. ఆషాడ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగను గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని కూడా చెబుతారు . వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి రోజును గురు పౌర్ణమి గా జరుపుకుంటారు.

భగవంతుని చేరుకునే ఆధ్యాత్మిక మార్గం చూపే వాడు గురువే కాబట్టి అటువంటి గురువులు నేను ప్రత్యేకంగా స్మరించుకుంటారు.ఇక గురుపౌర్ణమి తిధి నిన్న రాత్రి 8 గంటల 22 నిమిషాల నుండి, నేడు సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు కొనసాగుతుంది. నేడు గురుపౌర్ణమి సందర్భంగా జాతకంలో బృహస్పతి బలం పెరగాలంటే తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం.

Guru Purnima 2023: Dont forget these things with turmeric to increase your jupiter strength!!

పసుపు రంగు దేవ గురువు అయిన బృహస్పతి కి చెందిన రంగు కాబట్టి నుదిటిపై పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకోండి. మెడ, మణికట్టు మీద జాతకంలో గురువు స్థానం బలపడుతుంది. ఈరోజు పసుపు వస్త్రాలు ధరించినా, పసుపు పచ్చని ఆహార పదార్ధాలు, స్వీట్లు దానం చేసినా గురు బలం పెరుగుతుంది. గురుపౌర్ణమి పర్వదినాన తండ్రికి, గురువుకు, తాతయ్యకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి.

గురు పౌర్ణమి రోజు విష్ణువు అనుగ్రహం పొందడానికి, బృహస్పతి బలంగా ఉండడానికి రావిచెట్టుకు నీళ్లను సమర్పించండి. పుస్తకాలు మరియు స్టేషనరీ బృహస్పతి గ్రహానికి సంబంధించినవి కాబట్టి పుస్తకాలను నేడు తప్పనిసరిగా కొనుగోలు చేయండి. ఇక రాశుల ప్రకారం గురు పౌర్ణమి నాడు జాతకంలో గురు బలం పెంచుకోవడానికి చెయ్యవలసిన దానాలను తప్పనిసరిగా చేయండి. ఈ రోజు చేసే దానాలు సర్వ శుభాలను కలిగిస్తాయి.

గురుపౌర్ణమి రోజున పవిత్ర నదులు, కొలనులలో స్నానం చేయడం అపారమైన పుణ్యాలను కలిగిస్తుంది. కాబట్టి సాధ్యమైతే పవిత్ర నదీ స్నానం చేయండి. నదీస్నానం సాధ్యం కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేసినా ఫలితం ఉంటుంది. అత్యంత నిష్ఠతో భగవంతుడిని, గురువులను పూజించండి. జాతకంలో గురుబలం పెరిగి సంపద, శ్రేయస్సు, కీర్తి వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+