కార్తిక మాసం హారతి వల్ల లాభం ఏమిటి?
న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర:
కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే.
నదీ స్నానం,ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు.కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి,కృష్ణ,కావేరి,నర్మద, తపతి,సింధు మొదలైన నదులన్నింటి నీరూ ఉరిందని భావించాలి.
హారతి వల్ల లాభము ఏమిటి

గృహములోను, పూజా గదిలోనేకాదు, గుడిలోను, శుభకార్యా లప్పడూ. పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను,
క్రొత్త పెళ్ళికూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రంఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయలలో అనేక మంది భక్తులు దేవుడ్ని దర్శిస్తుంటారు.
దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి
కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి.
ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటువ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూరహారతి
ఎలాగైతే క్షీణించి పోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ
హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక, పరమార్థం.












Click it and Unblock the Notifications