• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మండే ఎండలు 'లాక్ డౌన్ ' టైంలో ఆరోగ్య రక్షణ కొరకు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఎండాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినట్లే శరీరతాపం కుడా క్రమేమి పెరుగుతుంది, దీనిని అన్ని శరీరాలు తట్టుకోలేవు. శరీర ఉష్ణోగ్రత అధికమౌతే చమటకాయ, అలర్జీ , నీరసం, ఏది తిన్నా రుచించక పోవడం మొదలగు ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి సమ్మర్ సీజనల్ ఇబ్బందులు కలగ కూడదు అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

సబ్జా గింజలు :- వేసవిలో సబ్జా గింజలను తీసుకోవడం వల్ల ఉష్ణతాపం నుంచి బయటపడవచ్చు. అంతేకాదు ఈ సబ్జా గింజలను నీటిలో వేసి తాగడం వలన శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. సబ్జా గింజల నీళ్లు ఒక యాంటీబయాటిక్‌లా పని చేస్తాయి. అంతే కాకుండా ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. సబ్జా నీటిని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే

health care tips in lock down time due to summer

సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసెడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.

సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయి.

రాగులు ఆరోగ్య ప్రయోజనాలు:- రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వలన జీర్ణక్రియను నిధానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం ఎక్కువ సహాయపడుతుంది. ఇంకా మహిళల ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది. హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.

రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనీమియాను 'రక్తహీనత' నివారించడానికి సహాయపడుతుంది. ప్రోటీన్, అమైనో ఆమ్లాల కోసం రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల ఎదుగుదల కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

మిల్లెట్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి. రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం,అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్ వంటిది. కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

వేసవిలో బెల్లం కలిపిన ఉసిరిక చూర్ణం :- ఉసిరి కాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయ రక్తపోటును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో సహా కండరాల నొప్పులు కూడా నయమవుతాయి. ఉసిరిక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరిక చూర్ణాల్ని వేసి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి పటికబెల్లం పొడి కలిపి తాగుతుంటే రక్తపు పోటు క్రమబద్దమవుతుంది. తలదిమ్ము, తలతిరగడం వంటి పైత్య వికారాలు తగ్గుతాయి. రెండింతల బెల్లం కలిపిన ఉసిరిక చూర్ణాన్ని గచ్చకాయ మోతాదులో సేవిస్తుంటే కీళ్లనొప్పులు, మలబద్దకం, మూలవ్యాధి, శిరోజాలు తెల్లబడడం, ఊడిపోవడం తగ్గుతాయి.

ఉసిరిక, శొంఠి, తిప్పసత్తు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూను వంతున రోజూ రెండు సార్లు తేనె లేదా పాలల్లో కలిపి తీసుకుంటుంటే వీర్యవృద్ది అవుతుంది. శుక్రదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్లు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు అరస్పూను ఉసిరికపొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటుంటే శుక్రకణాల సంఖ్య పెరిగి సంతానవకాశాలు మెరుగవుతాయి. ఉసిరిక, వేయించిన జీలకర్ర, ఎండుగులాబి పూలు, నల్లఉప్పు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూన్ వంతున రోజూ రెండు సార్లు సేవిస్తుంటే కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, దుర్వాసన గల తేన్పులు, కడుపులో తిప్పినట్లుండడం, వాంతులు లాంటి సమస్యలు తగ్గుతాయి.

సమపాళ్లలో కలిపిన ఉసిరిక, పసుపుల చూర్ణాన్ని ఒక స్పూన్ వంతున రోజూ రెండుమూడు సార్లు పంచదార లేదా తేనె కలిపి సేవిస్తుంటే స్త్రీలల్లో కలిగే తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో కలిగే చురుకు, మంట తగ్గుతాయి. అంతేకాకుండా రక్తం శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గుతాయి.

జీలకర్ర, మిశ్రి ద్రవం :- ఓక గాజు గ్లాసులో ఉదయం ఒక 'టీ' స్పూన్ జీలకర్ర రెండు చెంచాల ఖండ షక్కర/ మిశ్రి/ నవ్వత్ పొడిని కలిగి గ్లాస్ నిండుగా నీళ్ళను పోసి ముతా పెట్టి మధ్యాహ్నం 3 :30 నుండి సాయంత్రం 5 గంటలలో లోపు కింద కూర్చొని నిధానంగా త్రాగాలి. ఇలా రోజుచేస్తే శరీర తాపం రాకుండా కాపాడుతుంది, చర్మం పొట్టు ఉడకుండా చలువ చేస్తుంది.

English summary
health care tips in 'lock down' time due to summer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X