రుచికరమైన 'పచ్చి కొబ్బరి చట్నీ'.. ఇలా ఈజీగా చేసుకోండి..!

కొబ్బరి చట్నీ అంటే చాలామందికి ఇష్టం. కొబ్బరి చట్నీని అన్నంలోకి అటు టిఫిన్ లోకి బాగుంటాయి. ఇక హోటల్ లో కొబ్బరి చట్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ మాదిరిగా ఇంట్లోనే టేస్టీగా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

రుచికరమైన పచ్చి కొబ్బరి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి తురుము లేదా ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు తీసుకోవాలి, పుట్నాల పప్పు(వేయించిన శనగపప్పు) రెండు టేబుల్ స్పూన్లు, వేరుశనగ గుళ్లు రెండు టేబుల్ స్పూన్ లు, వెల్లుల్లి రెబ్బలు మూడు లేదా నాలుగు, చింతపండు రుచికి సరిపడా, నీళ్లు సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తాళింపు కోసం నూనె రెండు టేబుల్ స్పూన్ లు, ఆవాలు, జీలకర్ర అర టీ స్పూన్, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు ఒక రెమ్మ తీసుకోవాలి.

Coconut Chutney Recipe Fresh Simple Ingredients and Quick Method to Prepare at Home style easy way

ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్లు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ మాదిరి గ్రైండింగ్ చేసుకోవాలి. అవసరమైతే మరిన్ని నీళ్లు పోసి చట్నీ మరీ పలుచగా కాకుండా చిక్కగా వచ్చేలా చూసుకోవాలి. ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ తాళింపును మిక్సీ పట్టి చట్నీలో కలపాలి. అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+