టీజీపీఎస్సీ ఉద్యోగాల జాతర: మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల, పూర్తి డీటెయిల్స్ ఇవే!
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కానుకను అందించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒకేసారి మూడు కీలక ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
మొత్తం 290 ఖాళీలలో రోడ్లు, భవనాల శాఖలోనే అత్యధిక పోస్టులు ఉన్నాయి. ఇందులో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 49 ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి మరియు ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 జులై 1 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు కమిషన్ ఓఎంఆర్ (OMR) లేదా కంప్యూటర్ ఆధారిత (CBRT) రాత పరీక్షను నిర్వహించనుంది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ముఖ్యమైన తేదీలు:
ఆర్‌అండ్‌బీ సివిల్ పోస్టులు: జూన్ 6 నుంచి జులై 13వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి అక్టోబరులో పరీక్షలు ఉంటాయి.
ఆర్‌అండ్‌బీ ఎలక్ట్రికల్ పోస్టులు: జూన్ 8 నుంచి జులై 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు అక్టోబరులోనే నిర్వహిస్తారు.
కాలుష్య నియంత్రణ మండలి పోస్టులు: జూన్ 10 నుంచి జులై 17వరకు దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. వీరికి సెప్టెంబరులోనే రాత పరీక్షలు జరగనున్నాయి.
ఈ ఏడాది ఉద్యోగాల ఏడాది
అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.ఈ ఏడాదిని పూర్తిస్థాయిలో ఉద్యోగాల సంవత్సరంగా మారుస్తామని, భవిష్యత్తులో మరిన్ని భారీ నోటిఫికేషన్లు వస్తాయని ఈ సందర్భంగా నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు.మరి ఇంకెందుకు ఆలస్యం.. ఉద్యోగార్ధులు రెడీ అయిపోండి.













Click it and Unblock the Notifications