తిరుమలలో ఫుడ్ సేఫ్టీకి శ్రీకారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 83,382 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,083 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.

లడ్డూ విక్రయాలు నాలుగు లక్షల వరకు రికార్డయ్యాయి. ఒక్కరోజులే 3.97 లడ్లను విక్రయం అయ్యాయి. 2.13 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. అలాగే.. 2,943 మంది అస్వస్థులు కాగా.. వారికి టీటీడీ సకాలంలో వైద్య సహాయాన్ని అందించగలిగింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.

TTD Pushes Hygienic Practices Regular Audits and Food Safety Training for Pilgrim Food Stalls

కాగా.. లక్షలాది భక్తుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్ష్యంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక ఆహార వ్యాపారులకు మూడు రోజుల ఫుడ్ సేఫ్టీపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టాల్స్ నిర్వహణ, హోటళ్లలో పాటించాల్సిన నియమాలు సమగ్ర శిక్షణ ఇస్తారు. పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. మంగళవారం ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది. దీన్ని టీటీడీ ఆరోగ్య విభాగం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), నెస్లే ఇండియా చేపట్టాయి.

ఈ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నెస్లే ఇండియా నిధులను సమకూర్చుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. భక్తుల ఆరోగ్యం, భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. టీటీడీ తమ అన్నప్రసాదం విభాగంలో పాటించే ఉన్నత పరిశుభ్రత ప్రమాణాలను ప్రైవేట్ వ్యాపారులు కూడా అనుసరించాలని, ఈ శిక్షణ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరగాలని ఆయన ఆదేశించారు.

325 ఆహార సంస్థలు, సుమారు 1,300 మంది ఆహార కార్యకర్తలకు ప్రయోజనం లభించే ఈ శిక్షణలో రోజువారీ పనులు, చట్టపరమైన నిబంధనలతో పాటు సురక్షిత ఆహార నిర్వహణ పద్ధతులు సిద్ధాంత, ఆచరణాత్మక విధానాల్లో నేర్పిస్తారు. ఏపీలో ఈ కార్యక్రమానికి తిరుమలను ఎంచుకున్న నెస్లె ఇండియాను వెంకయ్య చౌదరి ప్రశంసించారు. వ్యాపారులకు టోపీలు, గ్లోవ్స్, ఆప్రాన్లు, సబ్బులు, రక్షణ కిట్లను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళ్యాణి చౌల్ట్రీస్, సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+