కాకినాడ-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

హైదరాబాద్ లోని చర్లపల్లి (Charlapalli)- ఏపీలోని కాకినాడ (Kakinada) మధ్య ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రెండు రోజుల పాటు రెండు ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలను, హాల్ట్ లను ఇవాళ దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విడుదల చేశారు. అలాగే చర్లపల్లి-తిరుపతి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.

Visakhapatnam: విశాఖ టూ షాలిమార్, బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
Visakhapatnam: విశాఖ టూ షాలిమార్, బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఈ నెల 25వ తేదీ గురువారం చర్లపల్లి నుంచి కాకినాడకు ఓ ప్రత్యేక రైలు 07819ను నడుపుతున్నారు. అలాగే ఈ నెల 28న ఆదివారం కాకినాడ నుంచి చర్లపల్లికి మరో ప్రత్యేక రైలు 07818ను నడుపుతున్నారు. ఈ రెండు రైళ్లకూ రెండువైపులా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే రెండు రైళ్లకూ మూడు సెకండ్ ఏసీ, ఐదు ధర్డ్ ఏసీ, పది స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ బోగీలు అందుబాటులో ఉంచారు.

Kakinada-Charlapalli Special Trains on June 25 and 28 South Coast Railway Schedule and Timings
Narasapur: నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ..!
Narasapur: నరసాపురం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఇకపై ఆ 4 రైళ్లూ..!

దీంతో పాటు చర్లపల్లి (Charlapalli)-తిరుపతి (Tirupati) మధ్య కూడా మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. చర్లపల్లి నుంచి తిరుపతికి ఈ నెల 25, 27 తేదీల్లో ఓ ప్రత్యేక రైలు 07819ను నడుపుతున్నారు. అలాగే తిరుపతి నుంచి చర్లపల్లికి మరో రెండు ప్రత్యేక రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో నడుపుతున్నారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లకూ రెండు వైపులా జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే రెండు రైళ్లకూ మూడు సెకండ్ ఏసీ, ఐదు ధర్డ్ ఏసీ, పది స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజీ బోగీలు అందుబాటులో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+