తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్

తెలంగాణ ఆర్టీసీ తన రెవెన్యూను పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు వివిధ ప్యాకేజీలను అందిస్తూ లాభాలను ఆర్జిస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టాండ్లు, డిపోల్లోని అద్దెకు ఉన్న ఖాళీ కమర్షియల్ షాపులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించేందుకు సిద్ధం అవుతోంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ బ్రాండ్లను విస్తరించుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లు నిత్యం రద్దీగా ఉంటాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్లు కళకళలాడుతున్నాయి. వచ్చిపోయే వారితో బస్టాండ్లు సందు లేకుండా రద్దీగా ఉన్నాయి. గతంలో పండగల సమయంలో మాత్రమే ఇలా రద్దీ ఉండేది. ఇప్పుడు నిత్యం బస్టాండ్లు, డిపోల వద్ద రద్దీ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్లు, డిపోల్లో ఖాళీగా ఉన్న 694 కమర్షియల్ షాపులను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ 694 షాపులకు త్వరలోనే అధికారులు టెండర్లు పిలవనున్నారు. పారదర్శకమైన నిబంధనలు, లీజు పద్ధతుల ద్వారా ఈ స్థలాలను కేటాయించనున్నారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ఆర్టీసీ తన అధికారిక tgsrtc.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచింది. నగరం, టౌన్, మండలం ఇలా ఎక్కడెక్కడ ఖాళీ షాపులు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఎవరు నిర్వహిస్తున్నారు..? లీజు కాలపరిమితి, అద్దె తదితర పూర్తి వివరాలను వెబ్ సైట్ లో వివరించింది.

TGSRTC Offers 694 Shops for Rent Across Telangana Bus Stations Great Business Chance TGSRTC shops

దాంతో కొత్తగా వ్యాపారంలోకి వచ్చేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఆర్టీసీ బస్ స్టాండ్స్ లో నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు కాబట్టి వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రయాణికులకు అందుబాటులో హోటళ్లు, ఫుడ్ కోర్టులు, బేకరీ షాపులు, సూపర్ మార్కెట్లు, ఇతర వ్యాపార సముదాయాలను ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ షాపుల్లో పెట్టుకోవచ్చు. ఇక తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆదాయం మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+