Passport ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్..!

మన దేశంలో కొంతకాలంగా విదేశీయుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిష్టవేసి, ఇక్కడే ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు తీసుకుని ఎంచక్కా మన పౌరుల్లా కొనసాగుతున్న వారిపై కేంద్రం వరుసగా కొరడా ఝళిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆధార్ పౌరసత్వానికి (Citizenship) గుర్తు కాదని తేల్చిచెప్పేసింది. ఈ వాదనను సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ఇప్పుడు ఇదే క్రమంలో పాస్ పోర్టు (Passport) ఉన్నా మన దేశ పౌరులు కాదని కేంద్రం మరో ఉత్తర్వు జారీ చేసింది.

పాస్ పోర్ట్ పౌరసత్వానికి ధృవీకరణ కాదు

పాస్‌పోర్ట్ అనేది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే జారీ చేస్తారని, అయితే, పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. 14వ 'పాస్‌పోర్ట్ సేవా దివస్' సందర్భంగా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు ఏమిటనే దానిపై ఎక్స్ లో విదేశాంగశాఖ చేసిన ప్రకటన ఈ విస్తృత చర్చకు దారితీసింది. అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రాలే పాస్‌పోర్ట్‌లని ఇవాళ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంటే పాస్‌పోర్ట్ కలిగి ఉండటం మాత్రమే పౌరసత్వాన్ని నిర్ధారించదు.

Passport is Not Proof of Citizenship Says Government Here s What It Actually Means
శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి..!
శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి..!

ఇప్పటికే ఆధార్, ఓటర్ కార్డులపైనా

పౌరులు కాని వారికి పాస్‌పోర్ట్‌లు జారీ చేయబడవు కాబట్టి, ఈ పరిస్థితిలో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. వాస్తవానికి, పాస్‌పోర్ట్ పొందడం అంటే అది మీ సొంతం అని అర్థం కాదు. పాస్‌పోర్ట్ వెనుక భాగంలో ఉన్న గమనికలో, అది "భారత ప్రభుత్వ ఆస్తి" అని, ప్రభుత్వం ఆదేశించినప్పుడు దానిని తిరిగి అప్పగించాలని పేర్కొంటారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణకు సంబంధించిన విచారణ సందర్భంగా, ఆధార్ పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది కేవలం గుర్తింపు పత్రం మాత్రమేనని తేల్చింది. అలాగే ఓటర్ ఐడి కార్డును కూడా పౌరసత్వ పత్రంగా పరిగణించట్లేదు.

Passport is Not Proof of Citizenship Says Government Here s What It Actually Means
Post Office New Rules 2026: పోస్టాఫీస్ కొత్త రూల్స్ -ఇక డిపాజిట్లు, విత్ డ్రా ఇలా..!
Post Office New Rules 2026: పోస్టాఫీస్ కొత్త రూల్స్ -ఇక డిపాజిట్లు, విత్ డ్రా ఇలా..!

చట్టం ఏం చెబుతోంది ?

పౌరసత్వ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి జనవరి 26, 1950న లేదా ఆ తర్వాత, కానీ జూలై 1, 1987కి ముందు దేశంలో జన్మించి ఉంటే, వారు పుట్టుకతోనే భారతీయులుగా పరిగణించబడతారు. జూలై 1987 తర్వాత జన్మించిన వ్యక్తి విషయంలో, వారి తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు పౌరులైతే వారు పౌరసత్వాన్ని పొందవచ్చు. డిసెంబర్ 3 2004న లేదా ఆ తర్వాత జన్మించిన వారు పౌరసత్వాన్ని పొందాలంటే, వారి తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులై ఉండాలి. లేదా ఒకరు పౌరులై ఉండి, మరొకరు జనన సమయంలో అక్రమ వలసదారుగా ఉండకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+