మై బాడీ మై రైట్ అంటే.. వాడి కళ్ళు వాడి ఇష్టం - సింగర్ సునీత

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు "సునీత". హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం అంటే అతిశయోక్తి కాదు. లేటెస్ట్ గా మహిళల హక్కులు, ఫెమినిజం, సమాజంలో జరుగుతున్న చర్చలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మహిళల స్వేచ్ఛ, సమానత్వం పేరుతో కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. నిజమైన ఫెమినిజం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

"మై బాడీ మై రైట్"పై సంచలన వ్యాఖ్యలు..

మహిళలు తరచూ వినిపించే "మై బాడీ మై రైట్" అనే నినాదంపై కూడా సునీత స్పందించారు. "నీ శరీరం నీ ఇష్టం అనుకోవడం తప్పు కాదు. కానీ అదే సమయంలో 'హిస్ ఐస్ హిస్ రైట్' అని ఎదుటివారు అనవచ్చు. బిలియన్ల మంది మనుషుల ఆలోచనలను, చూపులను మార్చడం కంటే మన భద్రత, మన నిర్ణయాలపై దృష్టి పెట్టడం సులభమైన మార్గం" అని వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల స్వేచ్ఛను వ్యతిరేకించడం కాదని, ఫెమినిజం అసలు భావాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానని ఆమె వివరించారు.

singer-sunitha-shocking-comments-on-my-body-my-right-feminism-and-video-got-viral-on-media

అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఫెమినిజం పేరుతో జరుగుతున్న కొన్ని చర్చలు తనకు అస్సలు నచ్చవని సునీత అన్నారు. సిగరెట్ తాగడం, మద్యం సేవించడం లేదా ఇష్టమైన దుస్తులు ధరించడం వంటి విషయాలను సమానత్వంతో ముడిపెట్టడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. కొందరు మహిళలు సిగరెట్ తాగడాన్ని పురుషులతో సమానత్వంగా భావిస్తున్నారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద అపోహ అని వ్యాఖ్యానించారు.

నిజమైన సమానత్వం దుస్తులు లేదా వ్యక్తిగత అలవాట్లలో కాదని.. ఆలోచనలకు లభించే గౌరవంలో ఉంటుందని అన్నారు. ఒక మహిళ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే దానికి ఎంత విలువ ఇస్తున్నారు? ఆమె ఆలోచనలను గౌరవిస్తున్నారా? అనే అంశాలపై పోరాడాలి. అదే అసలైన ఈక్వాలిటీ అని చెప్పుకొచ్చారు. కానీ బట్టల పరిధిని పెంచుకోవడాన్ని ఫ్రీడమ్‌గా, ఫెమినిజంగా చూపించడం సరైంది కాదు" అని పేర్కొన్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ సమాన గౌరవానికి అర్హులు.. కానీ ఇద్దరి స్వభావం, శారీరక నిర్మాణం, జీవన విధానం వేరు కాబట్టి ప్రతి విషయంలో ఒకరిని ఒకరితో పోల్చడం అవసరం లేదని ఆమె చెప్పారు.

ఇండస్ట్రీలో వేధింపులు వాస్తవమే..

మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడిన సునీత, సినీ పరిశ్రమలో వేధింపులు జరుగుతున్నాయనే విషయాన్ని అంగీకరించారు. ముఖ్యంగా కొత్తగా అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో తాను కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నానని సునీత వెల్లడించారు. ఇక్కడ సురక్షితంగా ఉండాలంటే మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా బలంగా ఉండాలని స్పష్టం చేశారు.

అయితే సునీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతూ నిజమైన సమానత్వం అంటే పరస్పర గౌరవమేనని పేర్కొంటుండగా.. ఒక బ్యాచ్ కి మాత్రం దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+