Bonalu Festival 2026: భాగ్యనగరంలో బోనాల జాతర షెడ్యూల్ వచ్చేసింది

తెలంగాణాలో ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద పండగ బోనాలు. ఈ బోనాల పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిలుస్తోంది. అయితే ఈ ఏడాది బోనాల జాతర షెడ్యూల్ ఖరారైంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండగ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది బోనాల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు ఇప్పటికే రూ. 20 కోట్లు కేటాయించింది.

ఇక జులై 16, గురువారం రోజున చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడే తొలి బోనంతో ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ కానున్నాయి. అలాగే ఆగస్టు 2 ఆదివారం రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన ఉత్సవం జరగనుంది. ఈ వేడుకలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఆగస్టు 3 న లష్కర్ బోనాల మరుసటి రోజున రంగం కార్యక్రమం, అనంతరం అమ్మవారి ఘటాల ఊరేగింపు జరగనుంది.

అయితే తాజాగా ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Bonalu Festival Schedule Released in Bhagyanagar Telangana Govt Sanctions 20 Crore Bonalufestival

బోనాలు పండగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌ కు తరలివస్తారని, అమ్మవారి దర్శనం కోసం వివిధ దేవాలయాలను సందర్శిస్తారని చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్ఎంసీ, ఇతర పౌర శాఖలు సమగ్ర భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా భక్తులు, విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు ప్రణాళికల ద్వారా సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+