మందుబాబులకు ఊహించని గుడ్ న్యూస్, ఇక కోరుకున్న విధంగా..!!
ఏపీ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాల పై కొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎక్సైజ్ చేసిన ప్రతిపాదన లపైన చర్చించి ఆమోదం తెలిపింది. ధరల పెంపు లేకుండానే మందుబాబులు కోరుకున్న విధంగా కొత్త ఛాయిస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై సరికొత్త పరిమాణాల్లో మద్యం సీసా లను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఎక్సైజ్ శాఖ నిబంధనలను సవరించింది. కాగా,
కొద్ది రోజుల్లోనే ఈ కొత్త సైజుల బాటిళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు, పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పరిమాణంలో మద్యం సీసాలు రానున్నాయి. చాలాకాలంగా వీటి పరిమాణం 180, 375, 750 మిల్లీ లీటర్లలోనే ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా లీటరు, 90ఎంఎల్ సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 150, 200 ఎంఎల్ పరిమాణంతో సీసాలు తయారుచేస్తామని, అనుమతివ్వాలని ఇటీవల కొన్ని మద్యం కంపెనీలు కోరాయి. అందుకు అనుగుణంగా చౌకమద్యం (ఐఎంఎఫ్ఎల్) రూల్స్‌ను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసు అంటే ఏ పరిమాణంలో ఎన్ని సీసాలు ఉంటాయో కూడా అందులో పేర్కొన్నారు. ఒక కేసుకు క్వార్టర్ సీసాలైతే 48, హాఫ్ బాటిళ్లు 24, ఫుల్ బాటిళ్లు 12 ఉంటాయి. కొత్తగా రాబోయే 150 ఎంఎల్ సీసాలైతే 60, 200 ఎంఎల్ సీసాలు 45 ఒక కేసులో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలే కొత్త పరిమాణంలోని సీసాలకూ వర్తిస్తాయి.

కోరుకున్న పరిమాణంలో అందుబాటులోకి
కాగా, ఈ నిర్ణయంతో అమ్మకాల్లో మార్పులొచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ మంది క్వార్టర్ సీసాలే కొంటుంటారు. అంతకంటే తక్కువ లిక్కర్ చాలని భావిస్తే అందులో సగం 90ఎంఎల్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 150, 200 ఎంఎల్ సీసాలు వస్తే కొంత ధర తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ పరిమాణా ల్లో కూడా మద్యం సీసాలను తయారు చేసేందుకు అనుమతించాలని పలు లిక్కర్ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. కంపెనీల విజ్ఞప్తిని పరిశీలించిన ఎక్సైజ్ శాఖ, పాత నిబంధనలను సవరిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా మద్యం షాపులు, బార్లకు మద్యం బ్రాండ్ల పేర్లతో ఉండే బోర్డులు, హోర్డింగులు తొలగించాలని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. వెంటనే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులకు స్పష్టంచేశారు. మద్యం దుకాణాల వద్ద ఏదో ఒక బ్రాండ్ పేరుతోనే బోర్డులు ఉన్నాయి. వారి బ్రాండ్లను ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఆయా బ్రాండ్ల పేరు, లైసెన్సీ పేరుతో కలిపి బోర్డులు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదు.













Click it and Unblock the Notifications