'నవ పంచమ రాజయోగం'తో ఈ 4 రాశుల ఇంట్లో కనకవర్షమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే క్రమంలో ఎన్నో అద్భుతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంత్యంత శక్తివంతమైన 'నవ పంచమ రాజయోగం' ప్రారంభమైంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల జాతకాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇకపై తిరుగులేని అదృష్టం వరించడంతో పాటు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంట్లో కనకవర్షం కురవనుంది.

నవ పంచమ రాజయోగం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రంలో రెండు శుభ గ్రహాలు పరస్పరం ప్రత్యేక స్థానాల్లో (ఒకదానికొకటి 5, 9 వ స్థానాల్లో) ఉన్నప్పుడు ఈ 'నవ పంచమ యోగం' ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగత జీవితంలో అపారమైన తెలివితేటలను, వృత్తి-వ్యాపారాల్లో ఊహించని ఎదుగుదలను ఇస్తుంది. కెరీర్ పరంగా సరికొత్త అవకాశాలను వెతుక్కుంటూ వచ్చేలా చేసే ఈ యోగం.. 4 రాశుల వారిని ఎలా ధనవంతులను చేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope A shower of wealth awaits these 4 zodiac signs thanks to the Nava Panchama Raja Yoga

తులారాశి

తులారాశి వారికి ఈ రాజయోగం అయాచిత ధనలాభాలను తీసుకురాబోతోంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే కాలమిది. గతంలో ఎవరికైనా ఇచ్చి రాదనుకున్న మొండి బకాయిలు హఠాత్తుగా చేతికి అందుతాయి. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు కస్టమర్ల నుండి కొత్త ఒప్పందాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పని సామర్థ్యం పరంగా ప్రశంసలు దక్కుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి, కుటుంబ సభ్యులతో సరదాగా, నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి నవ పంచమ రాజయోగం కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీ ఇంట్లోకి ధన ప్రవాహం నిరంతరాయంగా సాగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పూర్వీకుల ఆస్తుల వివాదాలు సమసిపోయి, మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించి, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

మేష రాశి

నవ పంచమ రాజయోగం వల్ల మేష రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు అందుతాయి. ఒకటి కంటే ఎక్కువ వనరుల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కడం లేదా పదోన్నతి (ప్రమోషన్) వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ సమాచారం అందుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతుతో సమాజంలో మీ హోదా పెరుగుతుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం సమాజంలో తిరుగులేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. మీలోని నాయకత్వ లక్షణాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆదాయం గతంలో కంటే గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదొక సువర్ణావకాశం. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాల పంట పండుతుంది. ఆఫీసులో ఉన్నతాధికారుల నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+