జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.

ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

Horoscope April month Predictions for Individuals Born Under the Poorvabhadra Uttarabhadra or Revati Nakshatras

పూర్వాభాద్ర (మీన రాశి 1, 2, 3 పాదాలు - గురు గ్రహం అధిపతి)

ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురు గ్రహ ప్రభావం వల్ల కొన్ని పనులు నెమ్మదిగా సాగినా, అంతిమ విజయం మీదే అవుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఆదాయం బాగుంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల కోసం లేదా ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కంటి సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది. దీన్నుంచి బయటపడటానికి ప్రాణాయామం చేయాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గురువారం రోజు దక్షిణామూర్తిని దర్శించి, శనగలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఉత్తరాభాద్ర (మీన రాశి - శని గ్రహం అధిపతి)

మీ నక్షత్రాధిపతి శని ప్రస్తుతం మీనరాశిలోనే సంచరిస్తుండటంతో బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో ఉంటేనే ఈ నెల గట్టెక్కగలరు. లేదంటే కష్టం. ఉద్యోగంలో బదిలీలు జరిగే అవకాశం ఉంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభించడానికి సమయం పడుతుంది. పట్టుదలతో శ్రమపడాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మధ్యస్థంగా లాభాలుంటాయి. గతంలోని మొండి బాకీలు వసూలవుతాయి. అయితే, ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కీళ్ల నొప్పులు లేదా పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. శనివారం రోజు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోష నివారణ జరుగుతుంది.

రేవతి (మీన రాశి - బుధ గ్రహం అధిపతి)

రేవతి నక్షత్ర జాతకులకు ఈ నెల ఆలోచనా శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భూ సంబంధిత లావాదేవీల వల్ల లాభం చేకూరుతుంది. చర్మ సంబంధిత అలర్జీలు లేదా నరాల బలహీనత పట్ల శ్రద్ధ వహించాలి. తగినంత విశ్రాంతి అవసరం. బుధవారం రోజు వినాయకుడికి గరికతో పూజ చేయడం, ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+