జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.
ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

మూల నక్షత్రం (ధనుస్సు రాశి 4 పాదాలు)
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పట్టుదలతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నెలాఖరులో చిన్నపాటి ఉద్యోగమైనా వస్తుంది. ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు లేదా గృహ అవసరాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలు తలెత్తుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. నడుము నొప్పి లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టొచ్చు. ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది.
పూర్వాషాఢ నక్షత్రం (ధనుస్సు రాశి 4 పాదాలు)
సమాజంలో హోదా పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు బాగుంది. కొత్త పెట్టుబడులకు ఇది అనువైన సమయం. ఒప్పందాలు కొత్తగా కుదురుతాయి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలున్నాయి. గతంలో వేరేవారి దగ్గర ఆగిపోయిన సొమ్ము ఈ నెలలో మీ చేతికి అందుతుంది. వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లల విషయంలో మీరు గర్వపడే వార్తలు వింటారు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి.
ఉత్తరాషాఢ నక్షత్రం (ధనుస్సు రాశి 1వ పాదం)
ఈ నెలలో ఈ నక్షత్రం వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి లేదంటే బదిలీ ఉంటుంది. పై అధికారుల నుంచి మద్దతు అందుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. షేర్ మార్కెట్ లేదా ఊహించని మార్గాల ద్వారా కొంత ధన లాభం ఉంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో మీ సలహాలను ఇతరులు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే ఒంటరిగానైనా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు లేదా వేడి వల్ల కలిగే ఇబ్బందులు ఉంటాయి. మంచినీరు ఎక్కువగా తాగాలి.
గురువారం షిరిడీ సాయిబాబాకు లేదంటే దక్షిణామూర్తికి శనగలు మాలగా వేసి పూజించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. అదీ మీకు వీలుంటేనే.. చేయగలిగితేనే.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications