శని దేవుడి దయవల్ల 4 రాశులకు మహర్దశ.. ఫిబ్రవరి 8 వరకు తిరుగులేదు!
నవగ్రహాల్లో కీలకమైన శని సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అక్టోబర్ 9న ఉత్తరా భాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని దేవుడు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 వరకు దాదాపు 104 రోజుల పాటు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నారు. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, ఈ సంచార ప్రభావం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల జాతకులకు అదృష్టం వరించడమే కాకుండా, ఊహించని ధనలాభాలు సిద్ధించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.
మకర రాశి
ఉత్తరా భాద్ర నక్షత్రంలో శని ప్రయాణం మకర రాశి వారికి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరంగా పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు తిరిగొస్తాయి. ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు మరింత మేలు చేస్తుంది.

మిథున రాశి
మిథున రాశి జాతకులకు ఈ కాలం అత్యంత అనుకూలంగా మారనుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం, ప్రశాంతత రెట్టింపు అవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయి. భారీ మొత్తంలో ధన లాభం పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో ముందస్తు జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని సంచారం బంపర్ ఆఫర్లా మారబోతోంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల తో ఉన్న చిన్నచిన్న వివాదాలు సమసిపోతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండి, కెరీర్లో పురోగతి సాధిస్తారు. కొద్దిగా ఓపికతో వ్యవహరిస్తే ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.
తులా రాశి
తుల రాశి వారి జాతకంలో కూడా ఆర్థిక పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రోజులుగా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి అను అనుకూలమైన ఆఫర్లు లభిస్తాయి. ప్రస్తుత ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆదాయ మార్గాలు పెరిగి విపరీతమైన ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి.














Click it and Unblock the Notifications
