ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ద్వాదశ రాశి ఫలాలు గ్రహ గతులు, నక్షత్ర సంచారం ఆధారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే మీ వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశల బట్టి ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
మేష రాశి
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో పనులు సకాలంలో పూర్తవుతాయి. ధన లాభం ఉన్నప్పటికీ, ఖర్చులను నియంత్రించుకోవాలి.

వృషభ రాశి
మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇతరుల సహకారం కంటే మీ స్వశక్తిపై ఆధారపడటం మంచిది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. సంయమనంగా ఉండాలి.
మిథున రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడుల విషయంలో లాభాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది.
కన్య రాశి
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సాయంత్రం సమయంలో కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. కొన్ని భావోద్వేగాల వల్ల నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు.
తులా రాశి
కోపాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వినోద కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
బయట పార్టీలు లేదా ఆహ్లాదకరమైన విందు వినోదాల్లో పాల్గొంటారు. దీనివల్ల ఉత్సాహంగా ఉంటారు. మిత్రులతో కలిసి కొత్త పనులు ప్రారంభిస్తారు.
ధనుస్సు రాశి
సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత పరిచయాలు తిరిగి బలపడతాయి. ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తుంది.
మకర రాశి
కార్యాలయంలో పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇంట్లో బాధ్యతల వల్ల కొంత అలసట కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
కుంభ రాశి
చిన్న చిన్న విషయాలకు చిరాకు పడొద్దు. అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆశించిన ఫలితాల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.
మీన రాశి
వెన్ను నొప్పి లేదా కీళ్ల నొప్పుల వంటి శారీరక ఇబ్బందులుంటాయి. విశ్రాంతి తీసుకోవడం అవసరం. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే నష్టపోతారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి మే నెల జాతక ఫలం -
శుక్రాదిత్య రాజయోగం త్వరలో.. ఈ రాశులవారికి లగ్జరీలు! -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications