కుంభరాశి, మీన రాశి జులై నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతుంటాయి. కొన్ని రాశులకు కలిసివస్తుంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంకొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖగోళంలో గ్రహాల కలయికతో ఈ పరిణామాలు ఏర్పడుతుంటాయి. అలాగే జులై నెలకు సంబంధించి కుంభ రాశి, మీన రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ జులై నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పైఅధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ ఆర్థికంగా పెద్ద నష్టాలు ఉండవు. ఆదాయం బాగున్నప్పటికీ, అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విలాస వస్తువులపై ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఉదర సంబంధిత లేదా కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం.శనివారం రోజు శని దేవుడికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి
మీన రాశి వారికి ఈ జులై నెల చాలా రంగాలలో సానుకూల మార్పులను, పురోగతిని తీసుకువస్తుంది. కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పుంజుకుంటాయి, కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా ఈ నెల ఎంతో అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి.
పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఎంతో ఆనందంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే, ప్రయాణాల సమయంలో కాస్త జాగ్రత్త అవసరం. గురువారం రోజు దక్షిణామూర్తిని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం, పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది.












Click it and Unblock the Notifications