Today Rasi Phalalu: శని-సూర్య సంయోగం.. ఈ నాలుగు రాశులకే లక్ష్మీ కటాక్షం!
02 మార్చ్2025 - ఆదివారం రాశి ఫలాలు. ఈరోజు రాశి ఫలాల ప్రకారం, కొన్ని రాశుల వారికి శుభవార్తలు, మరికొందరికి జాగ్రత్తలు అవసరం. గ్రహబలం, శని-సూర్య సంయోగం, మరియు మరికొన్ని గ్రహస్థితుల ప్రభావం ఈరోజు ఎలా ఉండబోతోందో చూద్దాం.
మేష రాశి (Aries)
ఈరోజు మీ పనులపట్ల శ్రద్ధ వహించాలి. గతంలో చేసిన కొన్ని తప్పులు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు ఒత్తిడిగా అనిపించినా, కొంత ఓపికగా వ్యవహరించాలి. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి (Taurus)
మీ కుటుంబ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రత్యర్థులు ఉత్పన్నమవ్వవచ్చు.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే వారికి అనుకూల సమయం. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి విజయం కనిపిస్తుంది. కుటుంబంలో సామరస్యంగా వ్యవహరించాలి .
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. కుటుంబ సమస్యలు కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహ రాశి (Leo)
ఈ రోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బలపడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.
కన్య రాశి (Virgo)
ఈ రోజు మీరు భవిష్యత్తు ప్రణాళికలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి.
తులా రాశి (Libra)
ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఖర్చులు పెరిగినా, తగిన ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలు మళ్లీ రావొచ్చు. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతారు. గొడవలు లేకుండా ఉండాలి.
ధనుస్సు రాశి (Sagittarius)
పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల సూచన ఉంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు పెరుగుతాయి.
మకర రాశి (Capricorn)
ఈ రోజు ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. కుటుంబంలో శుభకార్య సూచనలతో ఉత్సాహంగా గడుపుతారు .
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే సమస్యలు అధిగమించవచ్చు.
మీన రాశి (Pisces)
ఈ రోజు మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం. పేగు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు నిదానంగా నడిపించాలి.
గమనిక: ఇవి కేవలం సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం , గ్రహాల స్థానం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. మీరు మీ భవిష్యత్తు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
-
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications