5 రాశుల జీవితాల్లో ఐశ్వర్యం.. శుక్రుడి అరుదైన సంచారం
జ్యోతిష్య శాస్త్రంలో వైభోగం, ఐశ్వర్యం, ప్రేమ, విలాసవంతమైన జీవితానికి కారకుడిగా భావించే శుక్ర గ్రహం అతి త్వరలోనే ఒక అరుదైన సంచారం చేయబోతోంది. సాధారణంగా గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి లేదా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి విడివిడిగా మారుతుంటాయి. కానీ, ఈసారి శుక్రుడు ఒకే రోజు అటు రాశిని, ఇటు నక్షత్రాన్ని మార్చుకుంటూ "డబుల్ ట్రాన్సిట్" చేయబోతున్నాడు. ఈ అరుదైన ఖగోళ మార్పు కారణంగా రాబోయే రోజుల్లో 5 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని, వారి జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.
తులా రాశి
తులా రాశికి అధిపతి స్వయంగా శుక్రుడే కావడం వల్ల, ఈ రాశి వారికి ఈ డబుల్ ట్రాన్సిట్ బంపర్ జాక్‌పాట్ లాంటి ఫలితాలను ఇస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోయి ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనాలనుకునే వారి కల ఈ కాలంలో నెరవేరే బలమైన సూచనలు ఉన్నాయి.

మీన రాశి
మీన రాశి వారికి అదృష్టం 100 శాతం కలిసి రాబోతోంది. ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో కూడిన ప్రమోషన్ లేదా ఆశించిన బదిలీ లభించే అవకాశం ఉంది. సమాజంలో, బంధువులలో మీ గౌరవం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వశమవుతుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ 5 రాశుల వారికి కెరీర్, సామాజిక హోదా, దాంపత్య బంధాల పరంగా అద్భుతమైన కాలం ప్రారంభం కాబోతోంది.
వృషభ రాశి
శుక్రుడి డబుల్ ట్రాన్సిట్ వల్ల వృషభ రాశి వారికి ఆర్థికంగా అఖండ పురోగతి లభించబోతోంది. చాలాకాలంగా కోర్టు పనులు, ఆస్తుల వివాదాలు లేదా నిలిచిపోయిన ఇతర పనులు ఎట్టకేలకు సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
మిథున రాశి
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం ఒక సువర్ణావకాశం లాంటిది. ఆకస్మిక ధనలాభంతో పాటు నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ప్రేమికుల మధ్య ఉన్న పాత మనస్పర్థలు తొలగిపోయి, వారి బంధం మరింత బలపడుతుంది.
సింహ రాశి
సమాజంలో సింహ రాశి వారి కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. కార్యాలయంలో మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా, ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు లేదా షేర్ మార్కెట్ లావాదేవీల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.












Click it and Unblock the Notifications