జాతకంలో గ్రహ దోషాలా: జీవితంలో కష్టాలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

జాతక దోషాలు ఎలా ఉంటాయి?మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.నిజానికి జన్మ నక్షత్ర సమయానికి రాశి చక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు.జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృష్ట దోషాలు అంటారు.కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు. ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి.ఈ పరంపరలో అదృష్ట దోషాలు మొదటి భాగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. 

Horoscope: Grahadosalu in life

ఓ వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా కనిపించకపోయినప్పటికీ తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు.అయితే,ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..? ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు.ఆ దోషాన్నిఇచ్చే గ్రహ స్థితులు జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటాయి.

కొందరికి ఇంటి నిండా ధనం ఉన్నాతెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి.ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ, తనివితీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది.
ఇంక కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.ధన సంపద ఎంత ఉన్నప్పటికీ,సదరు కుటుంబంలో అధికులకు వివాహం కాకుండా వుండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం కనిపిస్తుంది.అంతేకాదు నయం చేయలేని వ్యాధులు కూడా వెంటాడుతాయి.

అంగవైకల్యంతో బాధ పడటం గానీ, వంశ పారంపర్యంగా వచ్చే వ్యాదులు కంటిచూపు తగ్గిపోవటం, చిన్న వయసులోనే బట్టతల రావడం, మూగవారుగా ఉండిపోవటం గాని,పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం ఇలా ఎన్నో అనర్ధాలు ఎదురవుతుంటాయి.ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయన్నది చాలా స్పష్టంగా పరిశీలించాల్సి ఉంటుంది. అవి జాతకాలలో అంతర్లీనంగా ఉండుంటాయి కనుక వాటి గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష్య తాళపత్రాల గ్రంధాల ద్వార తెలుసుతున్నాయి.

అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను అనుభవజ్ఞలైన జ్యోతిష పండితుల ద్వార మీ జాతక చక్రం వేయించుకుని అందులో ఉన్న దోషాలను అడిగి తెలుసుకొని వాటి పరిహారాలను క్రమబద్దంగా, శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది. 

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు,ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే జీవితం సంతోషమయంగా ఉంటుంది.అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే,ఫలితాలు సజావుగా ఉండవు. 

వ్యాధి ఒకటి ఉంటే దానికి సంబంధం లేని మాత్ర ఇంకొకటి వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు కదా ?. అలాగే జాతక దోషాలకు ఏదో నామమాత్రంగా పరిహారాలు చేయడం వల్ల కూడా ఎలాంటి శుభ ఫలితం ఉండదు.జాతక చక్రం ప్రకారం ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను వదిలివేయడం తగదు. నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక, తేలికపాటి అంశంతోనే చాలా మంది తూతూ మంత్రంగా చేయిదులుపుకుంటున్నారు.

ఈ కారణం వల్లే నిత్యం సమస్యలు,మానసిక ఒత్తిడులు,చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి.

జాతక చక్రంలోని ద్వాదశ భావాలలో కనపడని దోష స్థితులు వేరే అంశాల పరిశీలనలో కూడా కనబడుతుంటాయి.ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ, దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి.కొన్ని దోషాలకు మాత్రం ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాల్సి ఉంటుంది.మరికొన్ని దోషాలకు అతి దీర్ఘ కాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి.మంచి ఫలితాలు కావలంటే అచరించక తప్పదు. అనారోగ్యం చేస్తే డాక్టర్ సలహాలు తీసుకుంటాము,కాని అసలు అనారోగ్యమే కలగకుండా ముందస్తుగా జాగ్రత్త పడేందుకు జాతకపరిశీలన ద్వార సాద్యపడుతుంది.జాతక పరిశీనన ద్వార అనేక సమస్యలకు నివారణ ఉపాయాలను తెలుసుకోని ఆచరించి సత్ఫలితాలు పొంద వచ్చును.జాతకంలో ఏ విషయం వలన ఆరోగ్య ,కుటుంబ,ఆర్ధిక ,ఉద్యోగ,వ్యాపార మొదలైన ఇతర అనేక ఇబ్బందులు ఉన్నాయనే విషయంలో తరునోపాయాలకు ప్యామిలీ డాక్టర్ కన్న ప్యామిలీ ఆస్ట్రాలజరే మిన్న అని గ్రహించాలి జైశ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to astrologer Graha dosalu may affect life of every man.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి