సీఎం విజయ్ ను చూసి గర్వపడుతున్నా: రామ్ చరణ్ సంచలనం
మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'పెద్ది'.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదల కానుంది. జూన్ 3 రాత్రి నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. సినిమాకు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇటీవలె మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గ్రాండ్ గా పెద్ది కా ఆవాజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమం బిగ్ సక్సెస్ అయింది. ఇక తాజాగా చెన్నైలో పెద్ది చిత్ర బృందం సందడి చేసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, డీఓపీ రత్నవేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై సినిమా విశేషాల గురించి ప్రస్తావించారు. అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం విజయ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మేరకు తమిళనాడు సీఎం దళపతి విజయ్ కు.. రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టార్ డమ్ ను వదిలి ప్రజా సేవ కోసం విజయ్ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం అని కొనియాడారు. సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన్ను చూసి గర్వపడుతున్నా అని రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు.
CM విజయ్‌పై రామ్‌చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
— ChotaNews App (@ChotaNewsApp) May 30, 2026
తమిళనాడు సీఎం దళపతి విజయ్‌కు హీరో రామ్‌చరణ్ ప్రత్యేక అభినందనలు
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టార్‌డమ్‌ని వదిలి ప్రజా సేవ కోసం విజయ్ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం
సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన్ను చూసి గర్వపడుతున్నా
తమిళంలో… pic.twitter.com/Q3w1z7tck0
అలాగే ఇదే వేదికపై పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రెహమాన్ సార్... మీ గురించి నేనో పుస్తకం రాస్తా.. నాకు మ్యూజిక్ అనటం కూడా రాదని నా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు కానీ ఇప్పుడు నాకు మీతో సినిమా చేసే అవకాశం దక్కింది అంటూ బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఇక పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గ్రాండ్ గా జరగనుంది. అలాగే జూన్ 2 న తెలంగాణలోని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా పెద్ది మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది.












Click it and Unblock the Notifications