నవంబరులో లక్ష్మీ కటాక్షం కేవలం 6 రాశులకే!

నవంబర్ నెల జ్యోతిష్యపరంగా అత్యంత కీలకమైనదిగా మారనుంది. ఈ నెలలో సంభవించే ప్రధాన గ్రహాల సంచారాలు, మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక యోగం పట్టబోతోంది. నవంబర్ 1న సింహరాశిలోకి గురు గ్రహ ప్రవేశం, ఆపై నవంబర్ 12, 13 తేదీలలో శని, బుధ, శుక్ర గ్రహాల రుజు మార్గం, అలాగే కుజుడి రాశి మార్పుల కారణంగా ఆరు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారనున్నాయి.

ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో ఊహించని లాభాలు, ఆకస్మిక ధనలాభాలు ఈ రాశుల వారిని వరించనున్నాయి. మరి నవంబర్ నెలలో లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందబోతున్న ఆ 6 అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope In November Goddess Lakshmi s Blessings of Wealth and Prosperity Await These 6 Zodiac Signs

మేష రాశి: కోరికలు నెరవేరే కాలం

రాశ్యాధిపతి కుజుడు తన మిత్రక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తుండటంతో మేషరాశి వారికి ఈ నెల అంతా అనుకూల ఫలితాలు ఉంటాయి. మనసులోని దీర్ఘకాలిక కోరికలు నెరవేరడమే కాకుండా రాబడి గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.

తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

వృషభ రాశి: పట్టబోతున్న రాజయోగం

రాశ్యాధిపతి శుక్రుడితో పాటు మరో ఐదు గ్రహాలు పూర్తి అనుకూల స్థానంలోకి రానుండటంతో వృషభరాశి వారి దశ తిరగనుంది. ఉద్యోగంలో ఊహించని రీతిలో జీతాల పెంపు (ఇంక్రిమెంట్లు), ప్రమోషన్లు లభిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల నుంచి అంచనాలకు మించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు చేతికి మంచి ఆఫర్లు రావడం, వివాహ నిశ్చయం కావడం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.

కర్కాటక రాశి: సిరుల వర్షం

ధన స్థానంలో గురు గ్రహ ప్రవేశం కారణంగా కర్కాటక రాశి వారికి స్వల్ప ప్రయత్నంతోనే విశేష ధనలాభాలు కలుగుతాయి. శుక్ర, గురువుల శుభ వీక్షణతో వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతాయి. షేర్లు, పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

సింహ రాశి: అడ్డంకులు తొలగి ఆర్థిక బలం

గురు, కుజ గ్రహాలు సింహరాశిలోకి చేరుతుండటంతో ఆదాయ మార్గాలు అమాంతం పెరుగుతాయి. చాలా కాలంగా పీడిస్తున్న ఒత్తిళ్లు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి తగాదాలు తీరిపోవడంతో పాటు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సొంతింటి కల నెరవేరేందుకు ఇది అనువైన సమయం. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి లభిస్తుంది.

వృశ్చిక రాశి: పదే పదే ధన యోగాలు

దశమ స్థానంలో గురు, కుజుల సంచారం, ధన స్థానంపై గురు వీక్షణ వల్ల వృశ్చిక రాశి వారికి నెల పొడవునా ధన యోగాలు కలుగుతాయి. సంపాదన పెంచుకునేందుకు చేసే ప్రతి ప్రయత్నం నూటికి నూరు శాతం ఫలిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. వ్యాపారస్తులు భారీ లాభాలను అందుకుంటారు. శుభవార్తలతో ఇల్లు సంతోషంతో నిండిపోతుంది.

ధనుస్సు రాశి: విదేశీ యోగం, కొత్త అవకాశాలు

భాగ్య స్థానంలో రాశ్యాధిపతి గురువు, లాభ స్థానంలో శుక్ర, బుధుల కలయిక వల్ల ధనుస్సు రాశి వారికి మహర్దశ పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడి ఇతర ప్రముఖ సంస్థల నుంచి పిలుపు వస్తుంది. వ్యాపారంలో సరికొత్త వ్యూహాలతో రాణిస్తారు. షేర్లు, అదనపు ఆదాయ మార్గాల ద్వారా విశేష లాభాలు సమకూరుతాయి. అక్టోబర్ 31 తర్వాత శివాలయ దర్శనం చేసి శివార్చన చేయించడం లేదా శనిదేవునికి దీపారాధన వెలిగించడం వల్ల గ్రహ దోషాలు తొలగి, మరింత సంతోషకరమైన జీవితం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+