తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి 2026 సెప్టెంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి 2026 సెప్టెంబరు నెల జాతక ఫలం
కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి 2026 సెప్టెంబరు నెల జాతక ఫలం

తులా రాశి (చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు)

తులా రాశి వారికి ఈ సెప్టెంబరు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రంగాల్లో అనుకూలత లభించినప్పటికీ, ఖర్చులు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్థానచలనం లేదా బాధ్యతల మార్పు ఉండవచ్చు. ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ, ఊహించని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ప్రయాణాల నిమిత్తం ధనవ్యయం ఎక్కువ అవుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సమయానుకూలంగా సమసిపోతాయి. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. కంటి సమస్యలు, జీర్ణవ్యవస్థ లేదా అలసట వంటి చిన్నపాటి ఆరోగ్య రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. ప్రతి శనివారం లేదా మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మేష రాశి, వృష్ణభరాశి, మిథున రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
మేష రాశి, వృష్ణభరాశి, మిథున రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
Horoscope Predictions and results for these signs Libra Scorpio and Sagittarius for September 2026

వృశ్చిక రాశి (విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు)

వృశ్చిక రాశి వారికి 2026 సెప్టెంబరు నెల చాలా అనుకూలంగా, లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగావకాశాలు వెతుకుతున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారవేత్తలకు లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. నూతన ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. ఆస్తి కొనుగోలు ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. సంతానానికి సంబంధించి నూతన విజయాలు చూస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం లేదా పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి (మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం)

ధనూ రాశి వారికి ఈ నెలలో పనుల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ, చివరికి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమయం. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది.ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే, అనవసర ప్రయాణాలు, లగ్జరీ వస్తువులపై ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రకారం వ్యవహరించడం మంచిది.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు మీ ప్రతి పనికి లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. పని ఒత్తిడి వల్ల కాస్త శారీరక అలసట, రక్తపోటు లేదా కాళ్ల నొప్పులు రావచ్చు. తగిన విశ్రాంతి, ధ్యానం అవసరం. గురువారం రోజు దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తిని దర్శించుకుని శనగలు దానం చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+