కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇలా ఏర్పడే యోగాలవల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. 2026 నవంబరు నెలలో కుంభ రాశి, మీన రాశి వారికి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ నెలలో శని దేవుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నందున, ప్రతి విషయంలోనూ ఓపిక, సంయమనం చాలా అవసరం. కార్యాలయంలో పనిభారం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించడానికి కొంత సమయం పట్టవచ్చు. తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాటపై అప్రమత్తంగా ఉండాలి. ధన నష్టాలు లేదా ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అవసరానికి తగినట్లుగా ధనం లేదా అప్పు సర్దుబాటు కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరికీ పెద్ద మొత్తంలో హామీలు ఇవ్వడం గానీ, అప్పులు ఇవ్వడం గానీ చేయకండి.

కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం, శనివారాలలో ఆలయాలను దర్శించి ప్రదక్షిణలు చేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి జన్మరాశిలో శని సంచారం కొనసాగుతుండటం వల్ల ఈ మాసంలో వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరంగానూ ప్రధానమైన పరీక్షా సమయం నడుస్తుంది.మీ ప్రణాళికలు అమలు కావడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగువేయాలి. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత ముఖ్యం. ఆదాయం తక్కువగా ఉండి, ఊహించని ఖర్చులు ఎదురుకావొచ్చు. చేతికి డబ్బు అందడంలో ఆలస్యం జరగడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. రిస్క్ తో కూడిన లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.
మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఆవహిస్తాయి. కుటుంబ విషయాల్లో అనవసరమైన విషయాలను పట్టించుకోకపోవడం ప్రశాంతతను ఇస్తుంది. పిల్లల చదువు లేదా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. శనివారాల్లో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం లేదా పేదలకు దానధర్మాలు చేయడం వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది. గురువారం గురువైన సాయిబాబాను, దత్తాత్రేయుడిని, రాఘవేంద్రుడిని దర్శనం చేసుకోవడం శుభప్రదం.














Click it and Unblock the Notifications
