కుంభ రాశి, మీన రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో తులా రాశి, వృశ్చిక రాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.
కుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదాలు; శతభిషం 1, 2, 3, 4 పాదాలు; పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కుంభ రాశి వారికి డిసెంబరు నెలలో ఎంతో అదృష్టం కలిసివస్తుంది. నెల మొదటి వారంలో రాహువు జన్మ రాశిని వీడి 12వ స్థానంలోకి, కేతువు 6వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఇన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి, గందరగోళం తొలగిపోతాయి. ఏలినాటి శని చివరి దశ నడుస్తున్నప్పటికీ, పట్టుదలతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, లీగల్ వివాదాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేసే అద్భుతమైన అవకాశాలను అందుకుంటారు. ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. అయితే, డిసెంబరు మూడో వారంలో ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కాస్త ఆచితూచి అడుగువేయాలి.

కొత్త ఆదాయ మార్గాలు రావడంతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ అవసరాలకు తగిన వనరులు సమకూరి జీవనశైలి మెరుగవుతుంది. అయితే, వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు లేదా శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల సంభాషణల్లో కోపాన్ని అదుపులో ఉంచుకుని, మాట పట్టింపులకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది. కేతువు ఆరవ స్థానంలోకి మారడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాలు, గొంతుకు సంబంధించిన చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ, సరైన విశ్రాంతి తీసుకోవాలి. శనివారం నాడు శని దేవునికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి (పూర్వాభాద్ర 4వ పాదం; ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు; రేవతి 1, 2, 3, 4 పాదాలు)
మీన రాశి వారికి డిసెంబరు నెల మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. జన్మ రాశిలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, నెల మొదటి వారంలో రాహువు లాభ స్థానమైన 11వ ఇంటిలోకి ప్రవేశించడం మీకు పెద్ద ఊరటనిస్తుంది. దీనివల్ల ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ సవాళ్లను అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి, నూతన ఒప్పందాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. లాభ స్థానంలో రాహు సంచారం వల్ల ఆర్థికంగా మంచి మార్పులు కనిపిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అయితే, పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం.
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అయితే, కేతువు పంచమ స్థానంలో సంచరించడం వల్ల పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తు విషయంలో కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఓర్పుగా వ్యవహరించడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. పని ఒత్తిడి కారణంగా అలసట, నిద్రలేమి లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. యోగా, ధ్యానం చేయడం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురువారం నాడు శ్రీ దత్తాత్రేయుని లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, శనివారం రోజు శివారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.














Click it and Unblock the Notifications
