మేష రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇలా ఏర్పడే యోగాలవల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. 2026 నవంబరు నెలలో మేష రాశి, మీన రాశి వారికి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం.

కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

మేష రాశి

ఈ మాసంలో మేష రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ జీవితం, మాటతీరు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కార్యాలయంలో పనిభారం లేదా మానసిక ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో అనవసర వాదనలకు, ఘర్షణలకు వెళ్లకుండా ఉండటం మంచిది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించినప్పటికీ, నవంబర్ మధ్య భాగం వరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగువేయాలి. ఆదాయం బాగున్నప్పటికీ, అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన వస్తువుల కొనుగోలును తగ్గించుకుని, ఖర్చుల విషయంలో కఠినమైన బడ్జెట్ నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం.

Horoscope Predictions and results for these two zodiac signs Aries and Pisces for the Month of November

కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం. చిన్నచిన్న అపార్థాలు లేదా మనస్పర్థలు రాకుండా ఓపికగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో దైనందిన విషయాలపై వచ్చే చిన్నపాటి వాదనలను సర్దుబాటు చేసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం చాలా అవసరం. నిద్రలేమి, గొంతు లేదా ఛాతీకి సంబంధించిన చిన్నపాటి సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం లేదా ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు రాశి, మకర రాశి 2026 నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
ధనుస్సు రాశి, మకర రాశి 2026 నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

మీన రాశి

మీన రాశి వారికి ప్రస్తుతం జన్మ శని, 12వ ఇంట రాహువు సంచారం కారణంగా ఈ మాసం ఓర్పుకు, పరీక్షలకు తగిన సమయంగా ఉంటుంది. అయితే కొన్ని రంగాలలో అనుకూలతలు కూడా ఉన్నాయి. ఆఫీసులో పనిభారం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు లభించడానికి కొంత సమయం పట్టవచ్చు. సహోద్యోగులు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో పత్రాలు, లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం.

అకస్మాత్తుగా ధన నష్టాలు లేదా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం గానీ, హామీలు ఉండటం గానీ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి సంబంధించిన సమస్యలు, అలసట లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ఒంటరి ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. ప్రతిరోజూ సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం, శనివారాలలో ఆలయాలను దర్శించి ప్రదక్షిణలు చేయడం వల్ల మానసిక ధైర్యం చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+