సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో సింహరాశి, కన్యారాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

డిసెంబరు నెల సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం కారణంగా పనిలో చిన్నపాటి అడ్డంకులు లేదా అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే సవాళ్లను అధిగమిస్తారు. వ్యయ స్థాన ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. లాభ స్థానంలో గురు గ్రహ అనుగ్రహం ఉన్నందున సమయానికి ఏదో ఒక రూపంలో ధనంతో ఆదాయం సమకూరుతుంది.

బుధ ఉదయంతో నవంబర్ లో వృషభ రాశి సహా 5 రాశుల వారికి సంపదలు, భోగాలు!
బుధ ఉదయంతో నవంబర్ లో వృషభ రాశి సహా 5 రాశుల వారికి సంపదలు, భోగాలు!
Horoscope Predictions and results for these two zodiac signs Leo and Virgo for the Month of December

కుటుంబంలో చిన్నపాటి మాటపట్టింపులు రావచ్చు. సంభాషణల్లో సహనం చాలా అవసరం. జీవిత భాగస్వామితో సమయం గడపడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలనొప్పి, కంటి సమస్యలు లేదా అలసట ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం శ్రేయస్కరం. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, రోజూ హనుమాన్ చాలీసా పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)

డిసెంబరు నెల కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంట ఉచ్ఛ గురుడి సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి, గుర్తింపు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు అందుకునే సూచనలు ఉన్నాయి.

ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బుధవారాల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+