ధనుస్సు రాశి, మకర రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో తులా రాశి, వృశ్చిక రాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి (మూల 1, 2, 3, 4 పాదాలు; పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు; ఉత్తరాషాఢ 1వ పాదం)

డిసెంబరు నెల ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. నెల ప్రథమార్థంలో రవి, బుధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెల ద్వితీయార్థంలో రవి మీ జన్మ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ వ్యక్తిత్వానికి, మాటతీరుకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అయితే, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా బదిలీలకు సంబంధించిన చర్చలు కొలిక్కి వస్తాయి. సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.

తులా రాశి, వృశ్చిక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
తులా రాశి, వృశ్చిక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope Predictions and results for these two zodiac signs Sagittarius and Capricorn for the Month of December

ఆదాయ మార్గాలు బాగుంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. అయితే, నెల చివరి వారంలో కుటుంబ అవసరాలు, శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రవి జన్మ రాశి సంచారం వల్ల శరీరంలో వేడి పెరగడం, తలనొప్పి లేదా కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం మంచిది. గురువారం నాడు శ్రీ దత్తాత్రేయుని ఆరాధించడం, పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేయడం శుభప్రదం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం 1, 2, 3, 4 పాదాలు; ధనిష్ఠ 1, 2 పాదాలు)

మకర రాశి వారికి డిసెంబరు నెల కొంత అప్రమత్తతతో, ప్రణాళికాబద్ధంగా సాగాల్సిన సమయం. నెల ప్రథమార్థం లాభదాయకంగా ఉన్నప్పటికీ, నెల ద్వితీయార్థంలో వ్యయ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ప్రయాణాలు, ఖర్చులు పెరుగుతాయి. ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులకు విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాల నుంచి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవడం ఉత్తమం.

మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

నెల మొదటి పక్షం రోజులు ఆర్థికంగా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కానీ నెల ద్వితీయార్థంలో అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు, అప్పులు ఇవ్వవద్దు. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి సంభాషణల్లో సంయమనం పాటించండి. పిల్లల చదువు, భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శనివారం నాడు శని దేవునికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రతికూలతలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+