కన్యారాశి, వృశ్చిక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అక్టోబరు నెలకు సంబంధించి కన్యా రాశి, వృశ్చిక రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.

వృషభరాశి, కర్కాటక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
వృషభరాశి, కర్కాటక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త 1, 2, 3, 4 పాదాలు; చిత్త 1, 2 పాదాలు)

కన్యా రాశి వారికి అక్టోబరు నెల అత్యంత అనుకూలమైన కాలంగా ఉంటుంది. లాభ స్థానంలో గురుడి అనుగ్రహం వల్ల కోరుకున్న ఆశయాలు నెరవేరుతాయి.ఉద్యోగంలో పదోన్నతి , వేతన పెంపు లేదా ఆశించిన బదిలీలు పొందే అవకాశం ఉంది. ఐటి, బ్యాంకింగ్, టీచింగ్, మీడియా రంగాల్లోని వారికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ నెల చాలా బలపడే సమయం. రకరకాల మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది. పాత రుణాలు తీర్చడానికి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం.

Horoscope Predictions and results for these two zodiac signs virgo and scorpio for October month

వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చినా పట్టువిడుపులతో పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది. అయితే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, అలసట రాకుండా సరైన ఆహార నియమాలు పాటించాలి. శనివారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మేష రాశి, మిథున రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
మేష రాశి, మిథున రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం

వృశ్చిక రాశి (విశాఖ 4వ పాదం; అనూరాధ 1, 2, 3, 4 పాదాలు; జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు)

వృశ్చిక రాశి వారికి అక్టోబరు నెల ధైర్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు, పురోగతిని అందిస్తుంది. భాగ్య స్థానంలో గురుడి ఉచ్ఛ స్థితి వల్ల దైవబలం తోడై తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తిపరంగా నూతన ప్రాజెక్టులు అందుతాయి. దూరప్రాంత లేదా విదేశీ ప్రయాణాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి వారంలో కమ్యూనికేషన్, అగ్రిమెంట్ల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. బంధుమిత్రుల కలయికలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. పిల్లల చదువు, ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తాయి. రాశ్యాధిపతి కుజుడి ప్రభావం వల్ల శక్తి ఉత్సాహాలు నిండి ఉంటాయి. రక్తం లేదా ఉదర సంబంధ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+