కన్యారాశి, వృశ్చిక రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి కన్యారాశి, వృ జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
కార్యాలయంలో మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పదోన్నతి లేదా జీతాల పెంపునకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ధన ప్రవాహం బాగుంటుంది. గతంలో నిలిచిపోయిన రాబడులు చేతికి అందుతాయి. పాత రుణాలు తీర్చే మార్గాలు సుగమం అవుతాయి. అయితే, ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి బడ్జెట్ ప్రణాళిక అవసరం.
కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అయితే, మాట పరుషంగా లేకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది. మానసిక ఒత్తిడి పెరగకుండా విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం. ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా వినాయకుడికి గరిక సమర్పించి పూజించడం శ్రేయస్కరం. గోవులకు పచ్చని గడ్డి లేదా నానబెట్టిన పెసలను తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి.
వృశ్చిక రాశి
వృత్తిపరంగా పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పు వహించాలి. స్థానచలనం లేదా బాధ్యతల మార్పు ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తీవ్ర జాగ్రత్త వహించాలి. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకపోవడం మంచిది. కుటుంబ వాతావరణంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం.
భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే వివాదాలను నివారించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాల సమయంలో అప్రమత్తత అవసరం. ఉదర సంబంధ లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయస్వామికి తమలపాకుల మాల సమర్పించడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శన, కందులు దానం చేయడం వల్ల వృత్తి, ఆర్థికపరమైన అడ్డంకులు తొలగుతాయి.














Click it and Unblock the Notifications