మేష రాశి, వృష్ణభరాశి, మిథున రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి.సెప్టెంబరు నెలకు సంబంధించి మేష రాశి, వృష్ణభరాశి, మిథున రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి, మకర రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
వృశ్చిక రాశి, మకర రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

మేష రాశి

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ ప్రతిభతో సవాళ్లను అధిగమిస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు సహనం వహించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు మరియు ఆకస్మిక ప్రయాణాల వల్ల బడ్జెట్ దాటే అవకాశం ఉంది. కంటి సమస్యలు లేదా అలసట రావచ్చు. సరిపడా విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వెంటనే తొలగిపోతాయి.

తులా రాశి, సింహ రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
తులా రాశి, సింహ రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
Horoscope predictions and results for zodiac signs Aries Taurus and Gemini for the month of September

వృషభ రాశి

వృత్తిపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లేదా ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. పాత రుణాలు తీర్చడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి

పని ప్రదేశంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ధన యోగం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. అయితే రియల్ ఎస్టేట్ లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు రాకుండా ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, అయితే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+