తులా రాశి, సింహ రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి తులా రాశి, సింహ రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.
తులా రాశి (చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రమోషన్లు లేదా హోదాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు సహా కొత్త అవకాశాలు అందుతాయి. చాలా లాభదాయకమైన సమయం. ఆకస్మిక ధనలాభం, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. స్పెక్యులేషన్లు కలిసివస్తాయి. ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషకరంగా సాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పాత అనారోగ్యాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం పఠించడం శుభప్రదం.

సింహ రాశి (మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వఫల్గుణి/పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరఫల్గుణి/ఉత్తర 1వ పాదం)
బాధ్యతలు, పని ఒత్తిడి పెరుగుతాయి. మీ ప్రతిభతో అధికారుల గుర్తింపు పొందుతారు, సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. తొందరపడి కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సహనంతో సర్దుమణుగుతాయి. ద్వితీయార్థంలో బంధువుల కలయిక ఉంటుంది. అలసట, జీర్ణవ్యవస్థ లేదా కంటి సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు తప్పనిసరి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం, సూర్య నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.














Click it and Unblock the Notifications