జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి మే నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.

ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

Horoscope Predictions for Individuals Born Under the Poorvabhadra Uttarabhadra or Revati Nakshatras for may

మే నెలలో కుజుడు, గురుడు, శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది

మే 10 నుంచి జూన్ 20 మధ్య కుజుడు, గురుడి ప్రభావంతో ఆర్థికంగా మంచి మార్పులు వస్తాయి. నిలిచిపోయిన సొమ్ము అందడం లేదా కొత్త ఆదాయ వనరులు దొరకడం జరుగుతాయి. పూర్వీకుల ఆస్తి గొడవలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహువు ప్రభావంతో కొన్ని అనవసర ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. మీరు పట్టుదలగా చేసే ప్రయత్నాలు సఫలమై, కెరీర్‌లో మంచి గుర్తింపు పొందుతారు. జూన్ నెలలోపు ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు కానీ విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి లాభాలు మెండుగా ఉన్నాయి.

జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అవివాహితులకు శని ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది కానీ చివరకు మంచి సంబంధం కుదురుతుంది. తోబుట్టువులతో ఆస్తి విషయాల్లో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. అయితే రాజీ మార్గం అనుసరించడం ఉత్తమం. సూర్యుడి ప్రభావంతో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మే నెల రెండో వారం తర్వాత తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినవారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉత్తరాభాద్ర వారు శని తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల క్రమశిక్షణతో కూడిన పనులు విజయాన్ని అందిస్తాయి. రేవతి నక్షత్రంలో జన్మించినవారి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ధ్యానం చేయడం మంచిది.

శని ప్రభావం తగ్గడానికి శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురు గ్రహం అనుగ్రహం కోసం గురువారం దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు పసుపు రంగు పూలు సమర్పించండి. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+