మేషరాశి, వృషభరాశి, మిథున రాశి అక్టోబరు నెల జాతకం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అక్టోబరు నెలకు సంబంధించి మకర రాశి, మీన రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి స్థిరమైన పురోగతి ఉంటుంది. నెల మధ్య తర్వాత (ముఖ్యంగా అక్టోబర్ 17 తర్వాత) కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థికంగా నిలకడ ఉన్నప్పటికీ, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. పండుగ వాతావరణంతో బంధాలు బలపడతాయి. అయితే కుజుడి ప్రభావం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాయామం, సాత్విక ఆహారం అలవర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, హనుమంతుడిని పూజించడం చాలా మంచిది.

Horoscope Predictions for these three zodiac signs Aries Taurus Gemini for October month

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ అక్టోబరు నెల అత్యంత అనుకూలంగా, సానుకూల ఫలితాలతో సాగిపోతుంది. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటున్నప్పటికీ, ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. శుక్రవారం రోజున లక్ష్మీ గణపతి పూజ చేయడం, "ఓం శుం శుక్రాయ నమః" లేదా మహాలక్ష్మి మంత్రం జపించడం శుభప్రదం.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ నెల సృజనాత్మకతతో కూడిన కొత్త ఆలోచనలను అమలు చేయడానికి అద్భుతమైన సమయం. అందరికంటే విభిన్నంగా ఆలోచించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం ఉత్తమం. బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా "ఓం బుం బుధాయ నమః" మంత్రం జపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+