ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మిథున రాశివారికి, కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది బాగా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఈ రెండు రాశులవారి జాతక ఫలం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి. మీ తెలివితేటలతో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా మంచి సమయం. ఆదాయ పరంగా చూస్తే నిలకడగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు ఈ సమయంలోనే అందుతాయి. విలాసాల కోసం, లగ్జరీ కోసం ఖర్చులు పెరగకుండా చూసుకోకపోతే ఆర్థిక నష్టాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం లేని వారు శుభవార్ వింటారు. ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు అనుకూలించడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందికానీ, ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. నరాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో వాదనలకు వెళ్లకూడదు. తోటి ఉద్యోగుల నుంచి సహకారం ఆశించినంతగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు ఏప్రిల్ నెల ద్వితీయార్థంలో మంచి అవకాశాలు వస్తాయి. ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల ధనం ఖర్చవుతుంది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ నెలలో శ్రేయస్కరం కాదు. దూరంగా ఉండటం మంచిది.
జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మౌనంగా ఉండటం వల్ల సమస్యలు సద్దుమణుగుతాయి. ఇంటికి సంబంధించి మరమ్మతు పనులు చేయిస్తారు. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. కడుపునకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా జాగ్రత్త పడాలి. సోమవారం నాడు శివునికి అభిషేకం చేయడం లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.కర్కాటక రాశి వారికి గ్రహాల అనుకూలత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications