జన్మ నక్షత్రం అశ్వని, భరణి ఉన్నవారి మే నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.

ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

Horoscope Predictions for Those Born Under the Ashwini or Bharani Nakshatras for the month of may

అశ్విని నక్షత్రం (మే 2026)

అశ్విని నక్షత్ర జాతకులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాశ్యాధిపతి కుజుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల వీరిలో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు నెమ్మదిగా ఉండాలి. దూకుడు వద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, గతంలో చేసిన బాకీలు తీర్చడానికి కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఈ నెల ద్వితీయార్థంలో ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావచ్చు.

ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. సాయంత్రం వేళల్లో దైవ దర్శనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. రక్తపోటు లేదా ఉష్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయానికి భోజనం చేయడం ముఖ్యం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం లేదా అభిషేకం చేయడం వల్ల అశ్విని నక్షత్రం వారికి మేలు జరుగుతుంది.

భరణి నక్షత్రం (మే 2026)

భరణి నక్షత్ర జాతకులకు ఈ నెల ఆర్థికంగా చాలా బాగుంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూసే వారికి కొంతకాలంగా ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. విందులు, వినోదాల కోసం ఖర్చు పెరుగుతుంది. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు, సీనియర్ల సలహా తీసుకోవడం మంచిది. మంచి ధన లాభం ఉంది. ఇంట్లో శుభకార్యాల కోసం కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి.

బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. సంతాన పరమైన సమస్యలు ఉంటే అవి ఈ నెలలో పరిష్కారమవుతాయి. కంటి సమస్యలు లేదా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వేసవి ఎండల నుండి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి శుభం కలుగుతుంది. శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఏవైనా గ్రహ దోషాలు ఉంటే తగ్గుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+